Wednesday, 25 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / అంతర్జాతీయ వార్తలు

భారత విమానయాన రంగానికి షాక్ .... యుద్దం కారణంగా భారీ సంఖ్యలో సర్వీసుల రద్దు.. వివిధ దేశాల్లో పెద్ద సంఖ్యలో విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన భారతీయులు

02 Mar 2026
07:13 PM
26

Article Image
న్యూఢిల్లీ, మార్చి 2:

యుద్ధం కారణంగా భారత విమానయాన రంగానికి షాక్ తలిగింది. భారీ సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు అవుతున్నాయి. విమాన సర్వీసుల రద్దు కారణంగా వివిధ దేశాల్లో పెద్ద సంఖ్యలో భారతీయులు చిక్కుకుపోయారు.

 అమెరికా - ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌తో యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. యుద్ధం కారణంగా భారత విమానయాన రంగం ఇబ్బందుల్లో పడిపోయింది. భారీ సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు అవుతున్నాయి. విమాన సర్వీసుల రద్దు కారణంగా వివిధ దేశాల్లో పెద్ద సంఖ్యలో భారతీయులు చిక్కుకుపోయారు. యుద్ధం నేపథ్యంలో ఢిల్లీ ఐజీఐ 100 సర్వీసులను రద్దు చేసింది. చెన్నై ఎయిర్‌పోర్టు 30 సర్వీసులను, బెంగళూరు ఎయిర్‌పోర్టు 50 విమాన సర్వీసులను రద్దు చేసింది.

శంషాబాద్ ఎయిర్‌పోర్టు కూడా..

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి దోహా, అబుదాబి, జెడ్డా, సౌదీ అరేబియా వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి. అలాగే కువైట్, దుబాయ్, మస్కట్, మదీనా వెళ్లే సర్వీసులు కూడా తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. సుమారు 22 విమానాలు రద్దు కాగా, వివిధ దేశాల నుంచి రావాల్సిన మరో 22 విమానాలు కూడా రద్దయ్యాయి. ఎయిర్ ఇండియా‌తో పాటు ఇండిగో, ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్‌వేస్ వంటి విమానయాన సంస్థలు విమానాలను రద్దు చేశాయి.

 ఎయిర్‌ఫ్రాన్స్, ఎయిరిండియా, బ్రిటీష్ ఎయిర్‌వేస్, ఐబీరియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో, జపాన్ ఎయిర్‌లైన్స్, ఎల్ఓటీ ఎయిర్‌లైన్స్, లుఫ్తాన్సా, నార్వేజియన్ ఎయిర్, టర్కిష్ ఎయిర్‌లైన్స్, వర్జిన్ అట్లాంటిక్, ఖతార్ ఎయిర్‌వేస్, ఎయిర్ అల్జీరియా, స్కాండేవియన్ ఎయిర్‌లైన్స్, విజ్ ఎయిర్ వంటి ఎయిర్‌లైన్స్ పశ్చిమాసియాకు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.

Article Image

దీనితో పాటు ల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పశ్చిమాసియా వెళ్లే అన్ని అంతర్జాతీయ విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దుబాయ్ విమానాశ్రయం నుండి కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ PIA కూడా పశ్చిమాసియాకు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు వెల్లడించింది.

ఏవియేషన్ ట్రాకింగ్ డేటా మరియు ఎయిర్‌లైన్స్ స్టేట్‌మెంట్ ప్రకారం, పశ్ఛిమాసియాలోని పలు దేశాల్లో గగనతలాన్ని మూసివేశారు. దీని వలన పలు విమాన సర్వీసుల్లో అంతరాయాలు ఏర్పడ్డాయి. పశ్చిమాసియాలో నెలకొన్నిఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారత విమానయాన సంస్థలు ముందస్తు చర్యలు చేపట్టాయి. పశ్చిమాసియా దేశాలకు వెళ్లే అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.

 

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!