• పులివెందుల పీఎస్ లో కిరణ్ యాదవును సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్న సిబిఐ
• వివేక హత్య కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలతో ముగ్గురికి నోటీసులు జారీ చేసిన సిబిఐ
• సిబిఐ విచారణకు హాజరైన మహేంద్ర యాదవ్, కిరణ్ కుమార్ యాదవ్,
పులివెందుల :
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రెండేళ్ల తర్వాత శుక్రవారం పులివెందులలో సిబిఐ పులివెందుల చేరుకొని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టింది. సిబిఐ బృందం శుక్రవారం మధ్యాహ్నం పులివెందుల పోలీస్ స్టేషన్ కు చేరుకొని స్థానిక పోలీసులతో చర్చించిన అనంతరం కిరణ్ కుమార్ యాదవ్, మహేంద్ర యాదవ్ లకు సిబిఐ నోటీసులు జారీ చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి 2018 మార్చి 15 లో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనమైంది?. అయితే మాజీ మంత్రి హత్య కేసు విచారణ రాష్ట్ర హైకోర్టు సిబిఐ కు బదిలాయించిన విషయము విధితమే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం సిబిఐ బృందం పులివెందుల చేరుకొని, స్థానిక పోలీస్ స్టేషన్లో కుమార్ యాదవ్ ను సుదీర్ఘంగా ప్రశ్నిస్తుంది. వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి సునీల్ కుమార్ యాదవ్ సమీప బందువు కిరణ్ యాదవ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి లను ఈనెల 20న హైదరాబాదులో సిబిఐ బృందం సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. పులివెందులలో వివేకానంద రెడ్డి హత్య తరువాత కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి కి పంపించిన వాట్సాప్ కాల్ పైనే సిబిఐ బృందం విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.