Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

కల్తీ లడ్డూపై చర్చించాలంటే భయమెందుకు....!! మండలి వైసీసీ పక్షనేత బొత్స సత్యనారాయణ ఫైర్....

26 Feb 2026
05:55 PM
143

• సభలో చర్చ జరిగే వరకు పట్టుబడుతూనే ఉంటాం...
• చంద్రబాబు మాయ, ఊసరవెల్లి మాటలు, ధన దోపిడీ ప్రజలకు తెలిసే వరకు పోరాడతాం...
• మేము వాకౌట్ చేయలేదు... వారే చైర్మన్ దగ్గరికి వచ్చి హంగామా చేస్తున్నారు.
• మీ ఇష్టం వచ్చినట్లు చేయటానికి ఇది టీడీపీ ఆఫీస్ కాదు


అమరావతి   :

కల్తీ లడ్డూపై చర్చించాలంటే భయమెందుకు కూటమికి ఎందుకంతా భయమని మండలి వైసీసీ పక్షనేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మండలి వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు లడ్డూ ప్రసాదం విషయమై భారీ ఉపన్యాసాలు ఇచ్చారని, మండలిలో మాత్రం ఎందుకు భయపడుతున్నారని  ప్రశ్నించారు. కేవలం నిజాలు వెలుగు చూస్తాయనే భయంతోనే ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని ఆయన మండిపడ్డారు. ఇందాపూర్ డెయిరీకి, చంద్రబాబు కుటుంబ సభ్యుల కంపెనీకి సంబంధం వుందా? లేదా? అని ఆయన మరోసారి ప్రశ్నించారు. సీఎం కుర్చీపై ఉన్న శ్రద్ధ, దేవుడు, దేవాలయాలపై ప్రభుత్వానికి లేదని ఆయన తప్పు పట్టారు.
చట్టాన్ని రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకుంటున్నారని... లడ్డులో జంతు కొవ్వు ఉందని చంద్రబాబు చెప్పారు.. కోర్టు వేసిన సిట్ నిగ్గు తేల్చింది. 329 రూపాయలకు హిందూపూర్ డెయిరీ ఉంటే.. ఈరోజు టీటీడీ 650 రూపాయలు కొంటుంది.. హిందూపూర్ డెయిరీకి.. హెరిటేజ్కి ఉన్న సంబంధం అదే. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నారు.. ఇప్పుడు కో యూనిట్ అంటున్నారు.. డిప్యూటీ సీఎం పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా ఈరోజు ఎందుకు చర్చించలేదు...ఆ దేవదేవుడు కూడా ఇటువంటి దోపిడీలను క్షమించడు. ఈ దోపిడిని అరికట్టాలి. వైఎస్సార్ ఏడుకొండలు జీవో ఇచ్చారు. ఏడుకొండలపై ప్రజలను మభ్య పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. 2016లో.. మజ్జిగ సైతం హెరిటేజ్లో కొనాలని జీవో ఇచ్చారు. చంద్రబాబు బుర్ర ఏ విధంగా పనిచేస్తుందో అనేదానికి ఇదే నిదర్శనం. మండలిలో ఎందుకు చర్చించడం లేదు.

విజయవాడలో పుష్కరాల పేరు చెప్పి చంద్రబాబు ఎన్నో గుళ్లు కూల్చేశారు. శ్రీశైలంలో లాఠీఛార్జి జరిగింది.. ఎవరిని సస్పెండ్ చేశారు. మీకు దేవుడిపైన దేవాలయాల పైన నమ్మకం లేదు.. కేవలం రాజకీయాలు కుర్చీలపైనే. ప్రజలను దగా చేయడం మోసం చేయడమే మీ ఎజెండా. చంద్రబాబు ధన దాహం కోసం దేవదేవుడు ప్రసాదాన్ని సైతం అవమానించారు. దేవదేవుడు ప్రసాదంపైనే అపోహలు సృష్టించారు. చంద్రబాబు నీ వయసుకి గాని ఆ ముఖ్యమంత్రి పదవి గాని న్యాయమా ఇది.. తప్పుని ఒప్పుకోకుండా ఎన్డీబీ రిపోర్ట్ అంటూ అవాస్తవాలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు హయాంలోనే నాలుగు ట్యాంకులు పట్టుకోలేదా?. సభలో చర్చ జరిగే వరకు పట్టుబడుతూనే ఉంటాం. చంద్రబాబు మాయ మాటలు, ఊసరవెల్లి మాటలు, ధన దోపిడీ ప్రజలకు తెలిసే వరకు పోరాడతాం. మేము వాకౌట్ చేయలేదు... వారే చైర్మన్ దగ్గరికి వచ్చి హంగామా చేస్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్లు చేయటానికి ఇది టీడీపీ ఆఫీస్ కాదు” అంటూ బొత్స మండిపడ్డారు.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!