• సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కు సీఎం బాబు, జలవనరులశాఖ మంత్రి నిమ్మల కట్టుబడి ఉన్నారా? లేదా?
• సీమకు హక్కుగా రావలసిన వాటా నీళ్లు రాకుండా చేయటం న్యాయమా, ధర్మమా?.
• సీమలో పంటలు పూర్తిగా ఎండిపోయి రైతాంగం నానా ఇబ్బందులు పడుతున్నా..ప్రభుత్వం సీమ గురించి పట్టించుకోవటం లేదు..
అమరావతి :
ఎపి శాసన మండలిలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశం అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు ప్రకంపనలు సృష్టించాయి. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను తానే చంద్రబాబుతో చర్చలు జరిపి, పనుల్ని నిలిపివేయించానని గర్వంగా ప్రకటించారని, రేవంత్ రెడ్డి కామెంట్స్ ను సీఎం చంద్రబాబు, జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఖండించకపోవడంతో పాటు అసలు ఆ ప్రాజెక్టే అవసరం లేదన్నట్టు మాట్లాడ్డంపై వైసీపీ సభ్యులు గట్టిగానే నిలదీశారు.
సీఎం రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై చేసిన కామెంట్స్ కు ఇప్పటికీ సీఎం చంద్రబాబు, జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కట్టుబడి ఉన్నారా? లేదా? అని వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. రాయలసీమ ప్రాంతం అత్యంత వెనుకబడిందని, కరవుకు ఆవాసమైందని, సాగునీళ్ల కోసం వైసీపీ హయాంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చామని వైసీపీ సభ్యులు చెప్పారు.
కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో కుమ్మక్కై సీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని నిలిపివేసి, రాయలసీమ ద్రోహిగా చంద్రబాబు మిగిలిపోయారని వైసీపీ సభ్యులు విమర్శించారు. మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని మళ్లీ కొనసాగిస్తారా? లేదా? చెప్పాలని ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారు. వైసీపీ నుంచి ప్రశ్నల పరంపర కొనసాగిస్తూ మండలిలో గట్టిగా నిలదీసినా కూటమి వైపు నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. దీంతో గందరగోళం నెలకొనడంతో మండలిని చైర్మన్ వాయిదా వేశారు.
సభలో ఎవరేమీ మాట్లాడారంటే....
మంత్రి నిమ్మలపై వైసీపీ పక్ష నేత బొత్స సీరియస్.. :
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై మంత్రి సమాధానం చెప్పకపోవడంపై బొత్స సీరియస్ అయ్యారు. సభా సంప్రదాయాలు ఉంటాయని, ఇరిగేషన్ మంత్రి ఉపన్యాసంతో మాకు అభ్యంతరం లేదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కట్టుబడి ఉన్నారా లేదా?. దానికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఒక రాయలసీమ వాసిగా ఉన్న చంద్రబాబు సీమ నీటి హక్కుల విషయంలో తెలంగాణతో లాలూచీ పడ్డారని, సీమకు హక్కుగా రావలసిన వాటా నీళ్లు రాకుండా చేయటం న్యాయమా, ధర్మమా? అన్నారు. లేకుంటే ప్రాజెక్ట్ పనులు ఆపాల్సిన అవసరం ఎముందన్నారు.
మీరు మిగిలిన పనులు పూర్తి చేస్తారా.. లేక రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతారా? అంటూ విమర్శించారు. అంతేకాకుండా మేం మాట్లాడుతుంటే మైక్ సౌండ్స్ తగ్గిపోతున్నాయని ఘాటుగా స్పందించారు.
• వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కామెంట్స్..
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సీమ ప్రాంత రైతులకు, ప్రజలకు చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్..
రాయలసీమ ప్రాంతంలో పూర్తిగా భూగర్భజలాలు అడుగంటి పోయాయి..చంద్రబాబు తో ఏకాంత సమావేశంలో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఆపించానని చెప్పారు..అయినా ఇంతవరకు టీడీపీ వాళ్ళు సమాధానం చెప్పలేదు..
పంటలు పూర్తిగా ఎండిపోయి రైతాంగం నానా ఇబ్బందులు పడుతున్నారు..కానీ ప్రభుత్వం మాత్రం సీమ హక్కుల గురించి పట్టించుకోవటం లేదు..
• వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం కామెంట్స్..
రాయలసీమ నీటి అవసరాలకు ఎత్తిపోతల పథకాలు చాలా అవసరం..రాజకీయ అవసరాల కోసం సీమ ఎత్తిపోతల పథకాన్ని మూసేస్తున్నారా..
దీనిపై ప్రజలకు అనేక అనుమానాలున్నాయి..ప్రజల ఆందోళనలు ప్రభుత్వం నివృత్తి చేయాలి..
• వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇసాక్ భాషా కామెంట్స్..
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల లోపు తెలంగాణ వాళ్ళు నీళ్లు తీసుకెళ్తున్నారు.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు 841 అడుగులకు వెళ్తే కానీ నీళ్లు అందవు.. 800 అడుగుల లోపు మన వంతుగా నీళ్ళు రావటానికి గత ప్రభుత్వ హయాంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెచ్చారు..దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేను ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి ప్రాజెక్టు పనులు ఆపించామని చెప్పారు..ఒక రాయలసీమ వాసిగా ఉన్న చంద్రబాబు సీమ నీటి హక్కుల విషయంలో తెలంగాణతో లాలూచీ పడ్డారు..
రాయలసీమకు హక్కుగా రావలసిన వాటా నీళ్లు రాకుండా చేయటం న్యాయమా, ధర్మమా?.
మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం చెబుతూ .. :
సభ్యులు అడిగిన ప్రశ్నల గురించే మాట్లాడాలి.. అడిగిన ప్రశ్నల్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అడగలేదు..వైసీపీ సభ్యులు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు..వైసీపీ వాళ్లకు సమాధానాలు వినే ధైర్యం ఉంటే రేపు చర్చిద్దాం..
మేం అన్నీ ప్రశ్నలపై సమాధానాలు చెప్పేందుకు సిద్ధం..పొరుగు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు అని చెప్పారు..పొరుగు రాష్ట్రంలో వారి రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు మాట్లాడుతారు..అధికారంలో ఉంటే ఒక రకంగా.. ప్రతిపక్షంలో ఉంటే మరో రకంగా మాట్లాడుతున్నారు ..గాలేరు - నగరి సహా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నాం..
మంత్రి నిమ్మల సమాధానంపై వైఎస్సార్సీపీ సభ్యుల అభ్యంతరం..సభలో పెద్దఎత్తున నినాదాలు..