Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

టీటీడీ లడ్డు కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో తాతాల్కిక ఊరట !

23 Feb 2026
01:24 PM
259

* ఏకసభ్య కమిటీ విచారణను కొనసాగించవచ్చునన్న సుప్రీం కోర్టు..
*కానీ  సిట్  దర్యాప్తును మించి.. ఏకసభ్య కమిషన్ విచారణ  చేయొద్దని మెలిక....
*పాలనాపరమైన అంశాలకు విచారణకు మాత్రమే పరిమితం కావాలని ఆదేశం...
*చట్ట ప్రకారం నడుచుకోవాలని సూచన....

 

Suprem court  : 

తిరుమల (టీటీడీ) లడ్డు తయారీ వ్యవహారంపై నమోదైన కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో ప్రభుత్వం కొత్తగా నియమించిన ఏకసభ్య కమిషన్ పై  ఖలైన పిటిషన్‌ విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

Subramanian Swamy దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, ఇప్పటికే ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ విచారణను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. అయితే ఏకసభ్య కమిషన్ "తన విధి నిర్వహణను చట్టపరమైన పరిమితుల్లో కొనసాగించాలని" సూచించింది. ఇదే సందర్బంలో సిట్  దర్యాప్తును మించి ఏకసభ్య కమిషన్ విచారణ  చేయొద్దని సూచించింది. కేవలం పాలనాపరమైన అంశాలకు విచారణకు మాత్రమే పరిమితం కావాలని ఆదేశించింది.

ప్రస్తుతం కమిటీ దర్యాప్తు కొనసాగించడానికి ఎటువంటి అడ్డంకి లేదని కోర్టు తెలిపింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి తాత్కాలిక ఉపశమనం లభించినట్లైంది. ఈ కేసులో తదుపరి విచారణ తేదీని సుప్రీంకోర్టు నిర్ణయించనుంది. కానీ కోర్టు విచారణ అనంతరం ఇదేదో ప్రభుత్వానికి అనుకూలం గా తీర్పు వచ్చినట్లు కాదన్న  అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే ఈ కమిషన్ ఏర్పాటుపై ప్రతిపక్ష వైసిపి మాత్రం వైసిపి నేతలను ఇబ్బంది పెట్టేందుకే కూటమి ప్రభుత్వం కొట్టపూరితంగా నియమించిందని ఆరోపిస్తున్నారు సిట్టు సిబిఐ విచారణ సందర్భంగా తిరుమలలో తయారీలో ఇలాంటి కల్తీ జరగలేదని నివేదిక ఇచ్చిన అందుకు భిన్నమైన నివేదిక ఇప్పించుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పండుతుందని అందులో భాగంగానే తమకు అనుకూలమైన అధికారితో ఈ యొక్క సభ్యత్వం నియమించుకుందని విమర్శించారు నివేదికల్లో వైసీపీకి వ్యతిరేకంగా రాకపోవడంతోనే ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తుందని మండిపడుతున్నారు. కానీ ఈ కమిషన్ ఏర్పాటుపై సుప్రీంకోర్టు కూడా సిట్ దరప్తుకు మించి జరపొద్దని, చట్ట పరిధిలోనే విచారణ చేపట్టాలని ఆదేశించడంతో కొత్తగా వెలికి తీసేది ఏమీ ఉండదని వైసీపీ చెబుతోది . లడ్డు తయారీలో కల్తీపై సిట్, సిబిఐ పూర్తిస్థాయిలో విచారణ జరిపినందున ఇప్పుడు ఏక సభ్య కమిషన్ నియమించడం అంటే ముందు నివేదికలకు భిన్నంగా నివేదిక ఇప్పించేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఆయినా కల్తిలో వాస్తవం లేనందున కొత్తగా తమకు వ్యతిరేకంగా వచ్చేది ఏమీ ఉండదంటూ వైసీపీ కూడా ధైర్యాన్ని ప్రదర్శిస్తొంది.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!