Iraon america war :
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ పై అమెరికా ఏ క్షణమైనా దాడులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో అమెరికా దాడులపై సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇందులో భాగంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ, ఆయన కుమారుడు మోజాబా ఖమేనీని టార్గెట్ చేసి హతమార్చేందుకు అమెరికా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఆక్సియోస్(Axios) నివేదికలో పేర్కొంది. దీంతో, ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
ఈ మేరకు తాజాగా అణు ఒప్పందం అంశంపై ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉదిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు అల్టిమేటం జారీ చేశారు. రాబోయే 10 నుంచి 15 రోజుల్లోగా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని, లేనిపక్షంలో ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మరోసారి హెచ్చరించారు.
ఈ క్రమంలో ఇరాన్ సమీపంలో అమెరికా సైన్యం దాడులు చేసేందుకు రెడీగా కూడా ఉంది. ఇరాన్ కు సమీపంలో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అనుమతి కోసం వేచిచూస్తున్నాయి. అత్యాధునిక విమానాలు మిడిల్ ఈస్ట్ కు చేరాయి. మరోవైపు, ఇరాన్ రష్యాలు కలిసి హార్మోజ్ జలసం యుద్ధ విన్యాసాలు ప్రారంభించాయి. ఈ పరిస్థితుల్లో ఏ క్షణం ఏం జరుగుతుందొనన్న టెన్షన్ వాతావరణం నెలకొంది.