హెరిటేజ్ సంస్థపై ..
అజిత్ పవార్ బందువు రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు..
*అజిత్ పవార్ మృతికి కారణమైన VSR కంపెనీకి హెరిటేజ్‌తో ఆర్థిక లావాదేవీలున్నాయి....
* భువనేశ్వరి, బ్రాహ్మణి సాక్ష్యాలతో సహా ప్రెస్ మీట్ పెట్టిన రోహిత్ ..
* రామ్మోహాన్ నాయుడు మంత్రిగా ఉంటే విచారణ సజావుగా సాగదు...
*తక్షణం అయనను తొలగించాలి ....
*తక్షణం ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని లేఖ...

ఇంటర్నెట్ డెస్క్ :
హెరిటేజ్ సంస్థపై దివంగత అజిత్ పవార్ బందువు రోహిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహరాష్ట్ర మాజీ డిప్యూటి సిఎం అజిత్ పవార్ ప్లేన్ క్రాష్ అయిన విమాన కంపెనీ VSR ventures కి హెరిటేజ్ కి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాకుండా భువనేశ్వరి, బ్రాహ్మణి ఫొటోలతో, సాక్ష్యాలతో సహా ప్రెస్ మీట్ లో చూపించారు.
హెరిటేజ్ కు VSR ventures కంపెనీ ప్రత్యక్ష్యంగా సంబంధాలు ఉంటే పరోక్షంగా అంటే సైడ్ నుంచి టిడిపికి చెందిన ముఖ్య నేతలకు సంబంధాలున్నాయని కామెంట్ చేశారు. ఒక వేళ మీ కంపెనీయే VSRకి ఫండింగ్ చేస్తుంటే ఇవ్నీ అధికారికంగా పేపర్ల మీద ఉన్నాయని, రీస్ట్రక్చరింగ్ జరిగిందన్నారు. మరి అలాంటప్పుడు అజిత్ పవార్ విషయంలో మీరు పారదర్శకంగా విచారణ జరుపుతారని ఎలా నమ్మాలని ప్రశ్నించారు. మీకు వ్యాపార లాభాలే ముఖ్యమైతే దీనివల్ల VSR కంపెనీకి రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. డిజిసిఎ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ద్వారా విచారణపై ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుందని ఆరోపించారు. ఆ ఒత్తిడి VSR కంపెనీని కాపాడటానికి అజిత్ పవార్ కు న్యాయం జరగకుండా చెయ్యడానికి ఉద్దేశించనదిగా తమ అభిప్రాయమన్నారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తప్పు చేశారని నేరుగా రోహిత్ పవార్ ఆరోపించనప్పటికీ... వీఎస్‌ఆర్ సంస్థతో రామ్మోహన్ నాయుడుకు సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. వీఎస్‌ఆర్ గ్రూప్‌కు చెందిన రోహిత్ సింగ్ వివాహం ఏడాది క్రితం జైపూర్‌లో జరిగితే... ఆ వేడుకకు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారని అన్నారు. ఈ క్రమంలోనే అజిత్ పవార్ విమాన ప్రమాదంపై దర్యాప్తులో పారదర్శకతపై తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయని అన్నారు. డీజీసీఏ కూడా పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ కిందే ఉంటుందని... అలాంటప్పుడు విచారణ అనేది హాస్యాస్పదం అవుతుందని ఆరోపించారు. అలాగే దర్యాప్తు చేస్తున్నవారిని, విచారణ ఎదుర్కొంటున్నవారికి మధ్య సంబంధాలు ఉన్నప్పుడు...న్యాయమైన దర్యాప్తు ఎలా ఆశించగలమని ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.అయితే తాజాగా అదే డిమాండ్‌ను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి మోదీకి కూడా రోహిత్ పవార్ లేఖ రాశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుపై తక్షణ చర్య తీసుకోవాలని కోరారు. వీఎఎస్‌ఆర్ కంపెనీ, రామ్మోహన్ నాయుడు పార్టీ మధ్య సంబంధాలు ఉన్నాయని... ఇది తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ విమాన ప్రమాదంపై అంతర్జాతీయ సంస్థలో సహకారంతో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. తక్షణం ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలు ఈ విషయంలో జోక్యం చేసుకుని, అజిత్ దాదాకు న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నాని చెప్పారు.
కుట్ర కోణంపై తీవ్ర అనుమానాలు..
ఈ ప్రమాదం వెనుక రెండు రకాల కుట్రలు ఉండే అవకాశం ఉందని రోహిత్ పవార్ మీడియా ప్రతినిధులతో అన్నారు. అజిత్ పవార్‌ను పక్కకు తప్పించేందుకు రాజకీయ ప్రత్యర్థులు చేసిన ప్రయత్నం కావొచ్చుని అనుమానం వ్యక్తం చేశారు. అలాగే వీఎస్‌ఆర్ సంస్థ ప్రయోజనాల కోసం లేదా భద్రతా లోపాలను కప్పిపుచ్చేందుకు జరిగిన కుట్ర కావొచ్చని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ రోజు విమానాన్ని నడిపిన పైలట్ కెప్టెన్ సుమిత్ కపూర్ ట్రాక్ రికార్డును కూడా ఆయన ప్రశ్నించారు. గతంలో మద్యం సేవించినందుకు మూడు ఏళ్ల పాటు సస్పెన్షన్‌కు గురైన పైలట్‌కు విమానాన్ని ఎలా అప్పగించారని ఆయన నిలదీశారు.
లోకేష్, పవన్ కళ్యాణ్ లు తిరుగుతున్న స్పెషల్ ఫ్లైట్స్ ఎవరివో చెప్పాలి.. :
రామ్మోహాన్ నాయుడిపై సంచలన అరోపణలు చేసిన రోహిత్ పవార్ మరో సంచలన కామెంట్స్ చేశారు. మంత్రి నారా లోకేష్, డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ లు తిరుగుతున్న స్పెషల్ ఫ్లైట్స్ ఎవరివో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఇప్పుడు ఇదే విషయపైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందువల్లే టీడీపీ అధికారంలో ఉన్న ప్రతీ సారి కేంద్రంలో విమానయాన మంత్రిత్వ శాఖనే తీసుకుంటుందన్న అరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఎపికి బిల్ గేట్స్ వచ్చిన రోజు కూడా లోకేష్ ఢిల్లీలో ఏదో ఏవియేషన్ కంపెనీ ప్రారంభించడానికి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మరీ వెళ్లారంటూ సోషియల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పాలు, పెరుగు,నెయ్యి మాత్రమే కాకుండా ఇలాంటి ఏవియేషన్ కంపెనీలకు హెరిటేజ్ ఫైనాన్స్ కూడా చేస్తుందని ఇప్పుడే తెలిసిందంటూ ఎక్స్, ఇతర సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ గా మారాయి.