Wednesday, 25 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు త్వరలో అతిపెద్ద నీటి నష్టం ... మాజీ మంత్రి శైలజానాథ్ ఆందోళన ...

20 Feb 2026
06:58 PM
156

* వ్యవసాయం ఇష్టంలేని చంద్రాబాబు వల్ల తీరని నష్టం...
* ఈ ప్రాంతాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని రైతాంగం ఆలోచిస్తున్న సమయంలో...
*వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 85 శాతం పూర్తి చేశారు...
* చంద్రబాబు తెలంగాణాకు తాకట్టు పెట్టడం వల్లే ఇప్పుడు నిలిచిపోయాయి..
* ఛలో కడపతో ప్రాజెక్టును సాధించుకోవల్సిన అవసరం ఉంది...

కడప  : 
రాయలసీమ,నెల్లూరు, ప్రకాశం, చెన్నై ప్రాంతాలకు త్వరలోనే అతిపెద్ద నీటి కష్టం రానుంది మాజీ మంత్రి వైసీపీ నేత శైలజానాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. కడపలో అయన మీడియాతో మాట్లాడుతూ  వ్యవసాయం అంటే ఏ మాత్రం ఇష్టం లేని చంద్రబాబునాయుడు వల్ల సీమకు సాగు, తాగునీటి కష్టం వస్తుందేమోనని అందరు అనుకున్నారని, కానీ తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టనట్లు అసెంబ్లీలో చెప్పారన్నారు. తాను చెప్పడం వల్లే సీమ ఎత్తిపోతల పథకం పనులు అపేశారని, చెప్పారన్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో  రాయలసీమ ప్రజలు ఈ ప్రాంతాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని ఎదురుచూస్తొందన్నారు.  అందువల్లే ప్రజల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల మేలు కోసం ఆలోచించే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున కృష్ణా పరివాహ ప్రాంతంలోని రాయలసీమ అనుబంధ జిల్లాల యొక్క నీటి కోసం ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందన్నారు. ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతానికి లైఫ్ లైన్ ప్రాజెక్టని, జలధారి అని వైఎస్ జగన్ చేపట్టడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు గురించి వైసీపీ, ఈ ప్రాంత ప్రజలు ఇంతగా గోంతెత్తి మాట్లాడుతున్నా చంద్రబాబుకు ీచమ కుట్టినట్లు కూడా లేదని, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరూ ప్రైవేట్ గా మాట్లాడుకుని. తమ ఇద్దరి ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం రాయలసీమ ప్రజల యొక్క గొంతును నిలిపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇక్కడ దాహార్తి తీర్చకుండా ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నది సత్యమని,

ఇలాంటి సందర్బంలో రాయలసీమ ప్రజలు మరొకసారి మేల్కొని తమ శక్తిని సామర్ధ్యాలు చూపించాల్సిన అవసరం వచ్చిందన్నారు.  అసలే ఇప్పుడు వరద కాలం తగ్గిపోయిన నేపథ్యంలో 800 అడుగులకు రాకముందే కోయిల్ సాగర్ ప్రాజెక్టు ద్వారా, విద్యుత్ ఉత్పత్తి మనకెప్పుడు నీళ్లు వస్తాయన్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో మనం కూడా తక్కువ సమయంలోనే నీరు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఓవైపు కర్ణాటకలో ప్రాజెక్టుల ఎత్తు పెంచుకుంటూ పోతుంటే మనం మాత్రం పాత ప్రాజెక్టుల మీద అధారపడితే కృష్ణా పరివాహాక ప్రాంతం నష్టపోయే పరిస్ధితి ఉందన్నారు.  ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచించే ప్రతి ఒక్కరితో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఈ బరువుని మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మోయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నామన్నారు. చంద్రబాబునాయుడు సాగిస్తున్న భయానకమైన పరిపాలనలో భయపడి మాట్లాడడానికి కూడా ఎవరు ఈ రాయలసీమ ప్రాంతాన్ని కాపాడడానికి ముందుకు వస్తారని ఎదురు చూసే క్రమంలో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు అందరు సిద్దంగా ఉన్నారని, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!