Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

బాబు మెడలు వంచైనా రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధిస్తాం ... కడప జిల్లా వైసీపీ అధ్యక్షులు పి. రవీంద్రనాథరెడ్డి హెచ్చరిక ...

20 Feb 2026
06:14 PM
740


*త్వరలో కడపలో సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నేతలు, రైతులతో భారీ సభ నిర్వహిస్తాం..
*ఈ కార్యక్రమానికి కృష్ణా పరివాహాక ప్రాంత జిల్లాల రైతులు, నాయకులు తరలిరావాలి..
* పార్టీలకు అతీతంగా తరలిరావాలి...
*నష్టం జరుగుతున్నా మౌనంగా ఉండటం పాపమే...
* టిడిపిలో ఉన్న వారు కూడా రాజీనామాలు చేసి తరలిరావల్సిన అవసరం ఉంది....
*ఛలో పోతిరెడ్డిపాడు సక్సెస్ చూస్తే రైతుల్లో ఎంతటి స్పందన ఉందో తెలుసుకోవచ్చు...
* ఛలో కడప కూడా అదే స్పూర్తితో నిర్వహిస్తాం ...

కడప : 

చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రైన రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉందని, ఇన్ని సార్లు అయన సీఎం కావడమంటే ప్రజలకు పట్టిన శాపమని కడప జిల్లా వైసీపీ అధ్యక్షులు రవీంద్రనాథరెడ్డ విమర్శించారు. కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అయన మాట్లాడుతూ నెట్ట నిలువుగా కృష్ణా పరివాహార ప్రాంతాన్నంత నాశనం చేశాడని, దీంతో రైతాంగం పంటల పండించుకోలేని పరిస్ధితి అందరం చూసిందేనన్నారు. 1996లో దేవగౌడ్ ను ప్రధానిని చేశానని జబ్బల చరుచుకుంటాడని, కానీ అయన హాయంలోనే అల్మట్టి, నారాయణపూర్ డ్యాంలు ఎత్తుపెంచడం జరిగిందన్నారు. అయన కూటమికి ఛైర్మన్ గా, సిఎం గా ఉండి కూడా అడ్డుచెప్పలేకపోయారని, ఫలితం మనకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.

పాలమైరు -రంగారెడ్డి, కల్వకుర్తి, ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణా శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచే నీరు తీసుకుంటుండటం వల్ల మనకు నష్టం జరుగుతుందని, ఈ ప్రాజెక్టులన్ని తెలంగాణా ఎలాంటి అనుమతులు లేకుండానే కడుతున్నారన్నారు. ఓ వైపు ఎగువన కర్ణాటక, తెలంగాణాలు ఇలా యధ్దేచ్చగా నీటిని తీసుకుంటూంటే మనకున్న అవకాశాలను బట్టి ప్రాజెక్టులను కట్టాల్సింది పోయి రాయలసీమ ఎత్తిపోతల పథకం లాంటి ప్రాజెక్టులను విస్మరించడం చాలా దారుణమన్నారు. రాయలసీమకు నీరు రాదని తెలిసే గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి  పోతిరెడ్డిపాడు సామార్ధ్యాన్ని 11500 క్యూసెక్కుల నుంచి 44 క్యూసెక్కులకు పెంచారన్నారు.  గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ 85 వేల క్యూసెక్కులకు పెంచడంతో పాటు దిగువన ఉన్న ప్రాజక్టులను, కాలువలను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారన్నారు. మనకు 101 టిఎంసీల వాటా ఉంటే ఒక్క జగన్మోహాన్ రెడ్డి హాయంలో మాత్రమే ఒకయేాది 115, మరో యేడాది 165 టిఎంసీల నీటిని విడుదల చెయ్యడం జరిగిందన్నారు. కానీ ఇప్పుడు వరద సమయం తగ్గడం, ఎగువన రాష్ట్రాలు ప్రాజెక్టులు నిర్మించడం వల్ల మనకు వరద వచ్చే సమయం కూడా తక్కువగా ఉందన్నారు. అందువల్లే మనం కూడా శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం ఉన్న సమయంలోనే నీటిని తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలా నీరు తీసుకోవాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం తప్పనిసరన్నారు.

కానీ చంద్రబాబు శిష్యుడు తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి అడిగిన మేరకు రాయలసీమ ఎత్తిపోతలక పథకం పనులు నిలిపివేశారని అసెంబ్లీలో ప్రకటించారని, ఓటుకు నోటు కేసు కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఫణంగా పెట్టారన్నారు. అంతేకాకుండా కర్ణాటక అల్మట్టి డ్యాం ఎత్తుపెంచేందుకు కసరత్తు చేస్తుందని, భూసేకరణ కూడా జరుగుతుందని, అయినా చంద్రబాబు నోరు మెదపడం లేదన్నారు.  చంద్రబాబు వల్ల రాయలసీమకు ఎలాంటి నష్టం వాటిల్లినా తాము చూస్తూ ఉరుకోమని, తప్ప చంద్రబాబు మెడలు వంచి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సాధించి తీరుతామన్నారు. ఈ ఎత్తిపోతకల పథకాన్ని చేపట్టకపోతే రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కూడా నష్టం వాటిల్లుతుందన్నారు.

ఇటీవలే ఒక రోజు గడువుతో పోతిరెడ్డిపాడు వద్ద చేపట్టిన ఛలో పోతిరెడ్డిపాడుకు పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారని, ఛలో పోతిరెడ్డిపాడు సక్సెస్ చూస్తే ప్రజల్లో, రైతుల్లో ఎంతటి స్పందన ఉందో తెలుస్తుందన్నారు. మార్చి 1వ తేదీన కడపలో ఉమ్మడి ఆరు జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించి త్వరలోనే కడపలో భారీ సభన నిర్వహిస్తామన్నారు. ఇంతటి నష్టం జరుగుతుంటే మౌనంగా ఉండటం కూడా పాపమేనని, సీమ కోసం, కృష్ణా  జలాల కోసం టిడిపికి రాజీనామా చేసైనా వచ్చి మద్దతు తెలిపాల్సిన అవసరం ఉందన్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలే కాకుండా ఇతర కృష్ణా నది పరివాహక ప్రాంత జిల్లాల రైతులు, నాయకులు కూడా తరలిరావాల్సిన అవసరం ఉందన్నారు. 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!