Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / జాతీయ వార్తలు

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం .... !

20 Feb 2026
05:15 PM
12

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం
సీఎం స్టాలిన్‌తో మాజీ సీఎం ఓపీఎస్‌ భేటీ
సీఎం స్టాలిన్‌కు మద్దతు తెలిపిన ఓపీఎస్‌
డీఎంకే ఐదేళ్ల పాలనను పొగిడిన ఓపీఎస్‌
వచ్చే ఎన్నికల్లో డీఎంకే మళ్లీ గెలుస్తుంది
డీఎంకే పాలనపై ప్రజల్లో నమ్మకం ఉంది-ఓపీఎస్‌

THAMILANADU  :


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, బహిష్కృత AIADMK నేత ఓ. పన్నీర్‌సెల్వం (OPS) ఫిబ్రవరి 20, 2026న చెన్నైలోని అసెంబ్లీలో సీఎం ఎంకే స్టాలిన్‌తో భేటీ అయ్యారు. 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. NDA నుండి పక్కకు వచ్చినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఓపీఎస్ స్టాలిన్‌ను కలవడం డిఎంకెతో పొత్తుకు సంకేతమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత ఐదేళ్ల పాలనలో స్టాలిన్ ప్రవేశపెట్టిన పలు పథకాలను ఓపీఎస్ ప్రశంసించారని సమాచారం. డీఎంకే ప్రభుత్వం మళ్లీ వస్తుందని ఓపీఎస్ ఆశాభావం వ్యక్తం చేసినట్లు  ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.ఓపీఎస్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే అయప్పన్ కూడా అసెంబ్లీలో స్టాలిన్ పాలనను పొగుడుతూ, వచ్చే ఎన్నికల్లో డీఎంకే భారీ విజయం సాధిస్తుందని పేర్కొన్నారు  OPS ఈ సమావేశంతో తమిళనాడులో తన రాజకీయ భవిష్యత్తు కోసం కొత్త పొత్తులను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది  
ఈ భేటీతో తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!