Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

ఇందాపూర్ డెయిరీపై చర్చ జరగాల్సిందే ...

20 Feb 2026
02:37 PM
70


ఇందాపూర్ డెయిరీపై చర్చ జరగాల్సిందే ...
-టీడీపీ నేతలకు కావాల్సింది స్వామివారి ఔన్నత్యం పెంచడం కాదు...
- కూటమి నేతలకు కావాల్సింది రాజకీయం..
-చంద్రబాబులా బూట్లు వేసుకుని మేం దేవుడి ఫోటోలను పట్టుకోలేదు
- కెమెరాలు ఉన్నాయిగా ఆధారాలు చూపించండి. 
-మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ సవాల్ ... 


అమరావతి: 

ఎపి సిఎం చంద్రబాబునాయుడు దేవదేవుడి ప్రసాదంపై  నిందారోపణలు చేయడంతో పాటు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారానికి చేశారని  శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం ఆయన శాసన మండలి మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. తన స్వలాభం కోసం తమ సంస్థలకు నెయ్యి టెండర్లు ఇప్పించుకోవడం కోసం అసత్యాలు చెప్పారన్నారు. సీబీఐ ఇచ్చిన రిపోర్టులో చాలా విషయాలు బయటికి వచ్చాయని.. హెరిటేజ్తో ఒప్పందం చేసుకున్న ఇందాపూర్ డెయిరీ నెయ్యిని సరఫరా చేసింది. 2015-19 మధ్య కల్తీ నెయ్యిని సరఫరా చేసినందుకు ఇందాపూర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఇందాపూర్ను బ్లాక్ లిస్ట్ నుంచి తప్పించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపారన్నారు. అవే ట్యాంకర్లను దాచి మళ్లీ వినియోగించారన్నారు. గోవిందా కూటమి నేతలకు ఇప్పటికైనా మంచి బుద్ధి ప్రసాదించాలని కోరాం. సభలో చర్చించమని కోరాం" అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

“సభలో టీడీపీ మంత్రులు అవాకులు, చవాకులు మాట్లాడారని, టీడీపీ నేతలకు కావాల్సింది స్వామివారి ఔన్నత్యం పెంచడం కాదు. కూటమి నేతలకు కావాల్సింది రాజకీయం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా చర్చకు రండి. చెప్పులు, బూట్లు వేసుకుని మేం దేవుడి ఫోటోలను పట్టుకుని ఉన్నట్లు నిరూపించండి. కెమెరాలు ఉన్నాయిగా మీకు వీలైతే ఆధారాలు చూపించండి. టీడీపీ నేతల వ్యాఖ్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. సభలో మేం ప్రదర్శించిన పేపర్లను నేనే స్వయంగా కలెక్ట్ చేసి టేబుల్ మీద పెట్టా. చంద్రబాబు లాగా మేం వేంకటేశ్వరస్వామి 个 ఫోటోలను బూట్లు వేసుకుని పట్టుకోలేదు. వాళ్లలాగా మంచి నీచబుద్ధి కాదు. మాకు దేవుడంటే ఎంతో విశ్వాసం.. దేవుడి పవిత్రత పట్ల మాకు గౌరవం ఉంది. టీడీపీ నేతలు డైవర్షన్ కోసమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలు టీడీపీ నేతల దుర్భుద్ధిని గమనించాలి. ఇందాపూర్తో హెరిటేజ్కు ఉన్న సంబంధాలపై చర్చకు కోరాం. మేం రెండు ప్రైవేట్ సంస్థల గురించి మాట్లాడాం. సంస్థల బదులు ఇంత మంది టీడీపీ మంత్రులు మాట్లాడాల్సిన అవసరమేంటి? టీడీపీ మంత్రులంతా ఆ సంస్థల్లో డైరెక్టర్లుగా పనిచేస్తున్నారా?. మంత్రులు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా హెరిటేజ్ కంపెనీని నడుపుతున్నారు. పదేపదే మాట్లాడటానికి మంత్రులకు సిగ్గుగా లేదా?. మాకు సభ పట్ల గౌరవం ఉంది. మేం సభలో రాజకీయం చేయలేదు...లడ్డూలో జంతువుల కొవ్వు కలిపామని మేం చెప్పలేదు కదా. ఇందాపూర్ను అడ్డుపెట్టుకుని హెరిటేజ్ ద్వారా దేవదేవుడి కానుకలను కాజేయాలనేది వారి ఆలోచన. మేం ఎందుకు క్షమాపణ చెప్పాలి. దేవుడి పవిత్రతను మేం ఏనాడూ దెబ్బతీయలేదు. బూట్లు వేసుకుని దేవుడు ఫోటోలు పట్టుకుని పవిత్రత దెబ్బతీసింది వాళ్లు. ఇందాపూర్పై సభలో కచ్చితంగా చర్చించాల్సిందే


ఏం సమాధానం చెబుతారు?: తోట త్రిమూర్తులు

దేవుడిని అవమానించారని ఊగిపోయిన జనసేన, బీజేపీ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? చంద్రబాబు బూట్లు వేసుకుని దేవుడి ఫోటోను పట్టుకున్నది మీకు కనిపించడం లేదా?. మేం దేవుడి ఫోటోలను సభలో చెప్పులతో పట్టుకున్నట్లు నిరూపించండి. దేవుడి ఫోటోలను చించి, విసిరేశారని మాట్లాడుతున్నారు. మేం ఫోటోలను చించినట్లు రుజువు చేయండి. దేవుడిని రాజకీయాల్లోకి లాగింది చంద్రబాబు, పవన్, కూటమి నేతలు. దేనికి సభలో మంత్రులు ఊగిపోతున్నారు.


చర్చకు రమ్మంటే పారిపోతున్నారు: బొమ్మి ఇజ్రాయిల్

డిప్యూటీ సీఎం దుర్గగుడి మెట్లు కడిగారు. కులమతాల మధ్య చిచ్చు రేపేలా మాట్లాడారు. ఈ రోజు ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడటం లేదు. నాలుగు రోజుల నుంచి చర్చకు రమ్మంటే పారిపోతున్నారు. ఇప్పకైనా సభలో చర్చకు రావాలని డిమాండ్ చేస్తున్నాం

సీబీఐ రిపోర్టుపై డైవర్షన్ పాలిటిక్స్: తూమాటి మాధవరావు

సీబీఐ రిపోర్టుపై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నిన్నటి వరకూ తిరుపతి లడ్డూపై ప్రచారం చేశారు. ఇప్పుడు అన్ని ఆలయాల్లోని ప్రసాదాలపై నిందలు వేస్తున్నారు. కులదైవం అని నీతులు చెప్పే చంద్రబాబు బూట్లు వేసుకుని ధరించి వెంకటేశ్వరస్వామి ఫోటోలు పట్టుకున్నారు. మేం దేవుడి ఫోటోలను చెప్పులు వేసుకుని పట్టుకున్నామని మాట్లాడటానికి మంత్రులకు సిగ్గుందా? టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు తిరుపతి మెట్లు కడిగి క్షమాపణ చెప్పాలి. మేం సభలో చెప్పులు వేసుకుని దేవుడి ఫోటోలు పట్టుకున్నట్లు నిరూపించండి. నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా. నిరూపించలేకపోతే కూటమి ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తారా?. అన్నీ భగవంతుడు చూస్తున్నాడు..కచ్చితంగా శిక్ష అనుభవిస్తారు.. 

దమ్ముంటే చర్చకు రావాలి: లేళ్ల అప్పిరెడ్డి..

తిరుపతి లడ్డూ ఎలా తయారు చేశారో చంద్రబాబుని ఎవరు అడిగారు. టీడీపీ కార్యకర్తల మీటింగ్లో తిరుపతి లడ్డూ గురించి చంద్రబాబు మాట్లాడాడు. దేశంలో ఎక్కడైనా ఇలా జరిగిందా? లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారన్నావ్. లడ్డూలో బాత్ రూమ్ కెమికల్స్ కలిపారన్నావ్. మత విధ్వేషాలను రెచ్చగొట్టడానికి అని మాట్లాడావ్. చంద్రబాబు నీ వయసుకి ఇది తగునా? వైఎస్సార్సీపీపై బురద జల్లడానికి దేవుడిని అడ్డంపెట్టుకోవడానికి సిగ్గులేదా?. సోము వీర్రాజు క్షమాపణ చెప్పమని మమ్మల్ని అడగడం కాదు. చంద్రబాబు, పవనను సోము వీర్రాజు క్షమాపణ కోరాలి. ఇందాపూర్, తిరుపతి లడ్డూపై సభలో చర్చిస్తేనే కోట్లాది మంది భక్తులకు వాస్తవాలు తెలుస్తాయి. దయచేసి సభను తప్పుదోవ పట్టించొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దమ్ముంటే చర్చకు రావాలి


కలియుగ దైవాన్ని రాజకీయాల్లోకి లాగింది ఎవరు? వరుదు కళ్యాణి

ఈరోజు సభలో మంత్రులు సుద్దపూసల్లా మాట్లాడుతున్నారు. కలియుగ దైవాన్ని రాజకీయాల్లోకి లాగింది ఎవరు?. లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసి ఫ్లెక్సీలు వేసింది ఎవరు?. చంద్రబాబు, కూటమి నేతలు ముందు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. సీబీఐ రిపోర్టు వచ్చాక బాత్ రూమ్ కెమికల్స్ కలిపారని మాట్లాడిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ఇందాపూర్, బోలేబాబాకు హెరిటేజ్తో సంబంధం ఉందని మేం చెప్పడం లేదు వాళ్ల వెబ్సైట్ లోనే చెప్పారు. దేవుడి సొమ్ముని తమ స్వప్రయోజనాలకు వాడుకున్నారు కాబట్టే భయపడుతున్నారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత, స్థాయి హోంమంత్రి అనితకు ఉందా?. ఇసుక, పశువుల రవాణా వాహనాల వద్ద పీఏలను పెట్టుకుని వసూళ్లు చేసుకునే స్థాయి మీది. ప్రజల్లోకి రావాలంటేనే జగన్ భయపడుతున్నారంటున్నారు. మీకు తెలియకపోతే మీ పోలీసులను అడగండి. వైఎస్ జగన్ రోడ్డు మీదకు వస్తే జన సముద్రం ఎలా ఉంటుందో? అధికార మదం, దురహంకారం అని సెర్చ్ చేస్తే అనిత పేరు వస్తుంది. వెన్నుపోటు అని సెర్చ్ చేస్తే టిడిపి, చంద్రబాబు పేరు వస్తుంది. వెన్నుపోటు అని గూగుల్ సెర్చ్ చేస్తే ఎవరిపేరు వస్తుందో హోంమంత్రి తెలుసుకోవాలి. ఇందాపూర్పై చర్చకు అంగీకరిస్తే మొత్తం అన్నీ తేలుతాయి. ఇచ్చిన హామీలు అమలు చేయలేక తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారం చేశారు. నెయ్యి టెండర్ల ద్వారా హెరిటేజ్కు ಲಲ್ಲಿ చేకూర్చుకున్నారు కాబట్టే డైవర్షన్ కు తెరతీశారు. మేం చెప్పులు విడిచి కౌన్సిల్లో దేవుడి ఫోటోలను పట్టుకున్నాం. ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలి. ఇందాపూర్ పై చర్చకు అంగీకరించాలి

 

 

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!