అమరావతి :
సోషియల్ మీడియాలో ప్రజాప్రతినిధుల ఫోటోలతో మానసిక దాడికి పాల్పడుతున్నారని, తమకు సంబంధం లేకపోయినా తమ ఫోటోలతో ఇలాంటి దాడికి పాల్పడుతున్నారని కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు శాఖకు కొత్త వాహానాలు సమకూర్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పిన అమె సోషియల్ మీడియా పోస్టులు మాకు చాలా పోయిన్ ఫుల్ గా ఉందన్నారు. ఇటీవల గుంటూరులో మాజీ మంత్రి అంబటి అరెస్టు సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవీపై మాజీ మంత్రి రోజాభూమికి మూడు అడుగులు ఉంటుందని కామెంట్స్ చేస్తే... అందులో అమెకు బదులుగా నా ఫోటో పెట్టి ( నా పేరు కూడా మాధవీ కావడం వల్ల) నేను వైఎస్ జగన్ ను ఎదో అన్నట్లు ట్రోల్ చేస్తున్నారని, దీనిపై ఎవరికి ఫిర్యాదు చెయ్యాలో తెలియడం లేదని, చేసినా ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా తెలియడం లేదన్నారు. తప్పక వీటి అడ్డుకట్టకు చర్యలు తీసుకోవాలన్నారు.
అంతేకాకుండా కడపలో ఈగల టీంల ఏర్పాటు వల్ల గంజాయి రవాణాకు చాలా వరకు అడ్డుకట్ట పడిందని, అయినా ఇంకా పూర్తి స్థాయిలో కట్టడి చేసేలా చర్యలు చేట్టాలని కోరారు. గంజాయి బ్యాచ్ పై ఫిర్యాదు చెయ్యడానికి భయపడుతున్నారని, రాత్రిళ్లు క్రికెట్ అడుతూ ఇళ్లపై దాడులకు పాల్పడుతున్నారని, కళాశాలలకు వెళ్తున్న వారి తలలపై దాడులకు తెగబడుతున్నారని సభ దృష్టికి తెచ్చారు. అయితే పోలీసులు ఎప్పుడు నిద్ర పోతున్నారో కూడా తెలియకుండా పని చేస్తున్నారని, వారికి ప్రభుత్వం తరుపున అందాల్సినవి అందేలా చూడాలని అమె ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ట్రాఫిక్ డ్యూటీల్లో రిటైర్ మెంట్ వయస్సులో ఉన్న వారిని నియమించడం వల్ల వారు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి డ్యూటీల్లో వయస్సు మీద పడిన వారిని కాకుండా తక్కువ వయస్సు ఉన్న వారిని నియమించాలని కోరారు.
కడపలో ఫైర్ స్టేషన్ ఎప్పుడో బ్రిటీష్ వారి హాయంలో నిర్మించిన భవనం కావడంతో కూలేందుకు సిద్దంగా ఉందని, డ్యూటీలు చేస్తున్న ఉద్యోగులకు కనీస వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తక్షణం కొత్త భవనాన్ని నిర్మించి అత్యాధునిక వసతులతో నిర్మించేలా చర్యలు చేపట్టాలన్నారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కూడా సాధ్యమైనన్ని ఎక్కువగా ఏర్పాటు చెయ్యాలని హోం మంత్రికి విన్నవించారు.