Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / జాతీయ వార్తలు

'ఎస్ఐఆర్' కు సిద్దంగా ఉండండి... ఎపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ఈసీ లేఖ

20 Feb 2026
12:12 AM
55

బీహార్‌లో పూర్తయిన 'ఎస్ఐఆర్' ప్రక్రియ
• ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం సన్నాహకాలను త్వరగా పూర్తి చేయాలన్న ఈసీ
• రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లకు సైతం ఈసీ లేఖ

DELHI  :
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు సిద్ధంగా ఉండాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మరో 22 రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. బీహార్, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో అమలు చేసిన 'ఎస్ఐఆర్' ప్రక్రియను దేశవ్యాప్తంగా చేపట్టేందుకు ఈసీ కసరత్తు చేస్తుండగా... వీటికి సంబంధించిన సన్నాహకాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈసీ సూచించింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, లడఖ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఢిల్లీ, ఒడిశా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లకు ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఏప్రిల్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముంది.

దేశవ్యాప్తంగా 'ఎస్ఐఆర్' ప్రక్రియను చేపట్టాలని గత ఏడాది జూన్ నెలలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బీహార్‌లో ఈ ప్రక్రియ పూర్తయింది. తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రక్రియ కొనసాగుతోంది. అసోంలో మాత్రం 'ఎస్ఐఆర్'కు బదులు ప్రత్యేక సవరణ పేరుతో ఓటరు జాబితా సవరణను పూర్తి చేశారు.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!