Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

ఇందాపూర్ పై చర్చంటే భయమెందుకు ... మండలి వైసీపీ పక్ష నేత బొత్స మండిపాటు .. మూడవ రోజు స్తంభించిన మండలి ... వాయిదా వేసిన ఛైర్మన్ ...

19 Feb 2026
12:30 PM
37


అమరావతి  : 
తిరుమల లడ్డూ కల్తీ, ఇందాపూర్ డెయిరీ వ్యవహారంపై వైసీపీ పట్టు వదలడం లేదు. మండలిలో చర్చకు అనుమతించాలంటూ ఈ రోజు కూడా వైసీపీ ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, వరుద కల్యాణి, మొండితోక అరుణ్ కుమార్ లు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ విషయమై చర్చకు వైసీపీ పట్టుబట్టడంతో మండల ఛైర్మన్ తీర్మానాన్ని తిరష్కరించారు. హెరిటేజ్, ఇందాపూర్ అంశంపై చర్చించాలంటూ పెద్ద ఎత్తున వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. అసలు ఇందాపూర్ పై చర్చకు ఎందుకు అనుమతించడం లేదని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. దీంతో వైసీపీ సభ్యులు సభలో నిరసనకు దిగారు. చైర్మన్ పోడియం వద్ద విజిల్స్ వేయడంతో సభ కొద్దిసేపు వాయిదా పడింది. సభలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చీజ్‌కి నెయ్యికి తేడా తెలియని ప్రతిపక్షం ఉండటం మన దౌర్భాగ్యం’ అని వ్యాఖ్యానించారు. గత మూడు రోజులుగా ప్రభుత్వం తరఫున స్పష్టమైన సమాధానాలు ఇస్తున్నా వైసీపీ సభ్యులు కావాలని సభా సమయాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. 

దీనికి కౌంటర్ ఇస్తూ మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అధికార పక్షం చర్చకు భయపడి తమపై ఎదురుదాడికి దిగుతుందని, డైవర్షన్ కోసం మంత్రి అచ్చెన్నాయుడు భారతి సిమెంట్స్ గురించి లేవనెత్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందాపూర్ ను అడ్డుపెట్టుకుని హెరిటేజ్ కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. కలియుగ దైవమైన దేవదేవుడిని అడ్డం పెట్టుకుని దోపీడీ చేశారని, అందుకు సంబంధించిన అధారాలు మీ వెబ్ సైట్ లోనే ఆధారాలున్నాయని, తమ వద్ద కూడా అధారాలున్నాయని... దమ్ముంటే చర్చకు రావాలని అయన మంత్రి బొత్సకు సవాల్ విసిరారు. 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!