Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

ఇందాపూర్ పై చర్చకు రండి తేల్చుకుందాం .... మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సవాల్ ..

18 Feb 2026
02:42 PM
27

* హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ తో చీకటి ఒప్పందంపై ..మండలిలో చర్చ జరగాల్సిందే...
*చీకటి ఒప్పందం లేకపోతే టిడిపికి భయమెందుకు...
*ప్రజలంతా రాగాద్వేషాలతో ఎదురుచూస్తున్నారు ...
* చీకటి ఒప్పందంతో దోచుకుతిన్నది వాస్తవం కాదా...  
* ప్రజా సమస్యలపై ,  ఇందాపూర్ పై  చర్చ జరగాల్సిందే ..
* రెండింటికి సమప్రాధాన్యత తో  చూస్తున్నాం ..

విజయవాడ  : 
తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందని దేవదేవుడి  ప్రసాదంపై టిడిపి నేతలు అసత్యాలు ప్రచారం చేశారని.. ఎలాంటి కొవ్వు లేదని సీబిఐ తేల్చిందని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన శాసనమండలి మీడియా పాయింట్లో మాట్లాడుతూ... ఇందాపూర్ ద్వారా దోచుకోవాలని చంద్రబాబు దుర్భుద్ధి మాట్లాడారంటూ దుయ్యబట్టారు. ఇదే అంశంపై తాము వాయిదా తీర్మానం ప్రవేశపెడితే  హోంమంత్రి వచ్చి ఏదోదో మాట్లాడుతున్నారని,మేం కూడా వాస్తవాలు తేల్చాలనే సభలో చర్చించమని కోరుతున్నామన్నారు.

 హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ తో చీకటి ఒప్పందం చేసుకుందని, ఈ ఒప్పందం ద్వారా దోచుకోవడమే హెరిటేజ్ ఆలోచనంటూ విమర్శించారు. హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ తో చీకటి ఒప్పందం  సభలో చర్చించడానికి ఈ ప్రభుత్వానికి భయం ఎందుకని ప్రశ్నించారు. సభలో బడ్జెట్తో పాటు ఇందాపూర్, హెరిటేజ్పై చర్చించాల్సిందేనన్నారు. ప్రజా సమస్యలు, ఈ వ్యవహారం రెండికి సమాన ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. “సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక డొల్ల బడ్జెట్ పెట్టారని,  ఏ వర్గం అవసరాలు తీర్చలేని బడ్జెట్ ఇదన్నారు. మేం చర్చించాలని కోరితే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, మేం చెప్పిన దాంట్లో అవాస్తవాలుంటే వాస్తవాలు తేల్చడానికి చర్చకు రావాలని, మేం ఆధారాలతో సహా నిరూపిస్తాం” అంటూ బొత్స సవాల్ విసిరారు.

“వివరణలు ఇచ్చే బదులు చర్చకు రావొచ్చు కదా అంటూ ప్రశ్నించారు. దోచుకోవడమే చంద్రబాబు ఏకైక లక్ష్యమని, 320కి కొనుగోలు చేసే నెయ్యి 700 కి పెంచడం వెనుక కారణం తెలియాల్సిందేనన్నారు. పాల రేటు అప్పట్లో తక్కువ ఇప్పుడు పెరిగిందంటున్నారని,ఏ సంవత్సరంలో పాల రేటు ఎంతో చర్చపెట్టాని,  టీడీపీ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయన్నారు. చంద్రబాబు, పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరార. ఈ దోపిడీని బీజేపీ నేతలు సమర్థిస్తారా?. చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి ఒక్కరోజు కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదు. రేపటిరోజైనా చర్చించేందుకు రావాలన్నారు. 

రైతులు గిట్టుబాటు ధరల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారని, నిరుద్యోగులు భృతి కోసం ఉద్యోగాల కోసం చూస్తున్నారని, విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం చూస్తున్నారని, కానీ హెరిటేజ్‌కు దోచిపెట్టడానికే ఇందుపూరును తెచ్చారన్నారు. ఇందాపూర్ ను  అడ్డుపెట్టుకుని హెరిటేజ్ కు  దోచిపెట్టాలని చూస్తున్నారన్నారు. గతంలో లడ్డూ ఇస్తే కళ్లకు అద్దుకుని తీసుకునేవారని, ఇప్పుడు లడ్డూ ఇస్తే పరిశీలించి చూసి తింటున్నారన్నారు. ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రలోభాలకు ఆశపడి మా పార్టీని వదిలిపోయారని, లోకేష్ తెలిసీ తెలియక మాట్లాడుతున్నారన్నారు. మేం పట్టుకోల్పోయామనే భావనలో ఆయన ఉంటే ఉండనివ్వండి మాకు ఎలాంటి నష్టం లేదని, హోంమంత్రి  మాత్రం ఆమెకు ఇచ్చిన స్క్రిప్ట్ ను చదువుతున్నారన్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని, ఇందాపూర్తో లాలూచీపడి దోచుకోవాలని హెరిటేజ్ సంస్థ చూస్తోందని, మేం చెప్పేది అబద్ధమైతే చర్చకురావాలన్నారు. 

వైసీపీ పరిపాలనలో లోపం ఉంటే ఈ ప్రభుత్వంలో ఆదాయం పెరగాలని, సంపద సృష్టిస్తామని చెప్పి.. వారి నాయకుల సంపద మాత్రమే పెంచుకుంటున్నారని మండిపడ్డారు. హెరిటేజ్ కు లాభం చేకూర్చడానికి చంద్రబాబు కుటుంబ ధనార్జన కోసం మహాపాపం చేశారని బొత్స విమర్శించారు. 

 

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!