Wednesday, 25 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళన ... వాయిదా తీర్మానాల తిరస్కరణతో ...సభలో గందరగోళం ఆందోళనలతో మండలిని అట్టుడికించిన వైసీపీ సభ్యులు ... దేవుడి పట్ల చిత్తశుద్ది ఉంటే చర్చ జరపాలని సవాల్ ....

18 Feb 2026
12:00 PM
108

అమరావతి, ఫిబ్రవరి 18: 

ఎపి శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు రెండవ రోజు ఆందోళన చేపట్టారు. తిరుమల లడ్డు కల్తీ, నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీ తో హెరిటేజ్ కు ఉన్న సంబంధంపై చర్చ జరపాలంటూ వైసీపీ ఎమ్మెల్సీలు రమేశ్ యాదవ్, సిపాయి సుబ్రమణ్యం, కేఆర్‌జే భరత్‌ లు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. నిన్న కూడా ఇదే అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చిన వైసీపీ ఆందోళన చేపట్టి మండలిని అట్టుడికించింది. ఈ రోజు కూడా అదే పట్టుపట్టింది. చైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లి ప్లకార్డులతో నిరసన తెలిపారు. సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. అనంతరం మండలి ప్రాంగాణంలో వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. తక్షణం  తిరుమల లడ్డు కల్తీ, నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీ తో హెరిటేజ్ కు ఉన్న సంబంధంపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. 
   

మంత్రి లోకేష్ కు వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కౌంటర్ :  
ఒకే పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు పరస్పర విరుద్ధంగా తీర్మానాలు ఇచ్చారని  వ్యాఖ్యనించినమంత్రి లోకేష్ కు వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. మా పార్టీ నుంచి టిడిపిలోకి వెళ్లిన ఎమ్మెల్సీలు చక్రవర్తి, మర్రి రాజశేఖర్ లు వాయిదా తీర్మానం ఇవ్వడంలో వింత లేదని, వారిద్దరు ఎప్పుడో టిడిపిలో చేరారని, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీలు అని అనడం హస్యస్పాదంగా ఉందని, వారిద్దరితో వారే వాయిదా తీర్మానం ఇప్పించి మా పార్టీ వాళ్లు అని అనడం చర్చను తప్పు దొవట్టించే  ప్రయత్నమన్నారు. ఇందాపూర్ డెయిరీపై చర్చకు తాము పట్టుబడుతున్నామని, టిడిపి నేతలకు దేవుడి పట్ల చిత్తశుద్ది ఉంటే కల్తీ లడ్డూ సహ ఇతర అన్ని అరోపణలపై చర్చ జరిపేందుకు సిద్దమా అని సవాల్ విసిరారు. 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!