
మదనపల్లె :
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అన్నమయ్య జిల్లా మదనపల్లె బాలిక హత్యాచారం కేసు నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. కరంబలకోట మండలం కనసానివారిపల్లె చెరువులో అతని మృతదేహం కనిపించింది.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు డెడ్‌బాడీని మదనపల్లెకు తరలిస్తున్నారు. నిన్న హత్యాచారం అనంతరం నిందితుడు పరారైనట్టు పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. అటు నీరుగట్టువారిపల్లిలోని కులవర్ధన్ ఇంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నిన్న అదృశ్యమైన ఏడేళ్ల బాలిక శవంగా కనిపించిన సంగతి తెలిసిందే. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. ఇంటికి సమీపంలోనే బాలిక ఓ డ్రమ్ములో శవమై కనిపించింది. కులవర్ధన్ అనే వ్యక్తిపై అనుమానం రావడంతో నిన్న స్థానికులు దాడి చేశారు. అనంతరం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొగా, తెల్లవారే సరికి చెరువులో శవమై కనిపించారు.