Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

కూటమిది మభ్యపెట్టే బడ్జెట్ తప్పా..ఎవరికి ఒరిగేదెమీ లేదు..

17 Feb 2026
09:14 PM
637

* రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎంతో అవసరం .. కానీ కేటాయింపులు లేవు..

కడప  :  

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మభ్యపెట్టే బడ్జెట్ తప్పా.. ఎవరికి ఎమీ ఒరిగేదేమీ లేదని, కనీసం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు కేటాయింపులు చెయ్యలేకపోయారని కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. కడపలో అయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నారు. ఇచ్చిన హామీలకు కేటాయింపులు చెయ్యలేదని, 18 యేళ్లు దాటిన మహిళలకు నెలకు 1500 వేలు ఇస్తామని ఇప్పటికి ఒక్కరికి ఇవ్వలేదని, ఇప్పుడు కేటాయింపులు లేవన్నారు. యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి వారిని మోం చేశారన్నారు.  
సీమ సాగునీటి ప్రాజెక్టులకు పెద్దగా కేటాయింపులు లేవని విమర్శించారు. 

రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎంతో అవసరమని, కానీ అలాంటి పథకానికి కూడా కేటాయింపులు చెయ్యలేదన్నారు. తెలంగాణా శ్రీశైలం జలాశయం నుంచి 800 అడుగుల నుంచే ఇబ్బడిముడ్డిగా నీటిని తీసుకెళ్తుందని, అదే శ్రీశైలంలో 854 అడుగుల నీరుంటేనే మనకు 7 వేల క్యూసెక్కుల వరకు నీరు వస్తుందని, 885 అడుగులుంటేనే మనకు 44 వేలు క్యూసెక్కుల నీరు తీసుకునే వీళుందన్నారు. కానీ తెలంగాణా 800 అడుగుల నుంచే విద్యుత్ ఉత్పత్తి, ఎత్తిపోతల పథకాల పేరుతో రోజుకు 8 నుంచి 10 టిఎంసీలు తీసుకెళ్తుంటే మనకెప్పుడు నీరోస్తుందని ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించుకుంటే మనం కూడా 800 అడుగుల నుంచే నీరు తీసుకోవచ్చునని, అప్పుడే ఇప్పటికి వరకు నిర్మించిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీరు వస్తుందన్నారు. ఇది పూర్తి చేసుకుంటే  తెలంగాణా రాజీకొచ్చి శ్రీశైలం నుంచి నీటిని తీసుకోవడంలో పునరాలోచన చేస్తుందని, ఇది నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టన్నారు. 


అంతేకాకుడా ఈ యేడాది కడప జిల్లాలో శనగ పంట దిగుబడి అధికంగా వచ్చిందని, కానీ సరైన ధర లేక నష్టపోతున్నారని జిల్లా కలెక్టర్ శ్రీథర్ దృష్టికి తీసుకెళ్లారు. 
ఇప్పటికే 25 శాతం పంటను రైతులు నిల్వ ఉంచుకోలేక దళారులకు అమ్ముకున్నారని, ఎక్కువ కాలం రైతులు నిల్వ ఉంచుకోలేరు కాబట్టి తక్షణం గిట్టుబాటు ధర కల్పించి రైతుల నుంచి పంటను వెంటనే కోనుగోలు చేసేందుకు చర్యలు తీసకోవాలన్నారు 

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!