Wednesday, 25 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

ఎపీ మండలిలో ఒక వైపే కెమెరాలు...!

17 Feb 2026
07:45 PM
290

* అన్ని కెమెరాలు కూటమి సభ్యుల వైపే ...!! 

* ఆందోళన చేస్తున్నా వైసీపీ సభ్యుల వైపు చూపని కెమెరాలు ...

 

అమరావతి : 

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు హాట్ హాట్ సాగాయి.  ఇందపూర్ తో హెరిటేజ్ కి, సిఎం చంద్రబాబు కుటుంభానికి ఉన్న సంబంధాలపై రాష్ర్ట వ్యాప్తంగా మాటల యుద్దం నడుస్తున్న వేళ  మంగళవారం కూడా శాసన మండలి కూడా గందరగోళంగా మారింది.  ఇందాపూర్ డెయిరీ నెయ్యి సరఫరాపై చర్చకు వైసీపీ వాయిదా నోటీసు ఇచ్చింది. కానీ  చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంతో మండలి చైర్మన్ ఈ తీర్మానాన్ని తిరస్కరించాల్సి వచ్చింది. అయితే ఈ తప్పక చర్చకు  అనుమతించాలంటూ వైసీపీ సభ్యులు మండలి ఛైర్మన్ పోడియాన్ని చుట్టూముట్టి ఆందోళనకు దిగారు. అంతకుముందు తమ సీట్లలోనే నిల్చుని ఆందోళన చేపట్టారు. కల్తీ నెయ్యి,  ఇందాపూర్ డెయిరీ వ్యవహారంపై చర్చించాలంటూ పెద్ద ఎత్తున ఆరుస్తూ సభలో గందరగోళాన్ని సృష్టించారు. అయితే మండలిని కవర్ చేస్తున్న కెమెరాలు మాత్రం టిడిపి, బిజేపి, జనసేన ఎమ్మెల్సీలను, మంత్రులను కవర్ చెయ్యడం తప్పా... వైసీపీ ఎమ్మెల్సీల ను మాత్రం చూపలేదు. సాధారణంగా చట్టసభల ప్రత్యక్ష ప్రసారానికి కనీసం ఐదు కోణాల్లో కెమెరాలు ఉంటాయి. ఒకటి ఛైర్మన్ (Bench) వైపు.రెండు, మూడు కెమెరాలు సభ్యులు, మంత్రులు మాట్లాడే స్థానాల వైపు ఉంటాయి. వీటితో పాటు మరికొన్ని గ్యాలరీ లేదా సభలోని ఇతర విభాగాల వైపు కేంద్రీకృతమై ఉంటాయి. సభలో పన్-టిల్ట్-జూమ్ (PTZ) కెమెరాలను కూడా ఉపయోగిస్తారు. ఇవి మాట్లాడే సభ్యుడిపైకి ఆటోమేటిక్‌గా జూమ్ అవ్వడానికి వీలుగా ఉంటాయి. ఇలా ఏ వైపు నుంచి సభ్యులు మాట్లాడినా ఎదురుగా ఉన్న కెమెరాలు చిత్రీకరిస్తాయి. కానీ వైసీపీ సభ్యులను కవర్ చెయ్యాల్సిన కెమెరాలను మాత్రం లైవ్ లో ఒక్క సారి కూడా చేపలేదు. కూటమి పార్టీల సభ్యులును చూపాలంటే ఛైర్మన్ ఎడమ భాగంలోని గ్యాలరీలో  పైభాగాన ఉన్న లాంగ్ కెమెరాల ద్వారా అందరిని చూపడమే గానీ, ఆందోళన చేస్తున్న వైసీపీ సభ్యులను మాత్రం ఒక్క సారంటే ఒక్క సారి చూపలేదు. మంత్రులు మాట్లాడుతునప్పుడు  దగ్గరి నుంచి చూపడం, మండలి ఛైర్మన్ ను చూపడం తప్పా వైసీపీ సభ్యుల వైపు కెమెరాలు చూపిన దాఖలాలు చాలా తక్కువే. ఇదంతా ప్రతిపక్ష్యం చేసే ఆందోళనలను, విమర్శలను, ఆందోళనలను చూపకూడదన్న కారణంగానే ఇలా చేశారన్న ఆరోపణలు లేకపోలేదు. 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!