- ఇందాపూర్ డెయిరీ వ్యవహారంతో వైసీపీ ఎదురుదాడి...
* మండలిలో చర్చకు వైసీపీ వాయిదా నోటీసు...
* చర్చించేది లేదన్న టిడిపి ...
* టిడిపికి, చంద్రబాబు సంస్థలకు నష్టం వాటిల్లితుందన్న భయంతోనే వెనకడుగుంటున్న వైసీపీ...
అమరావతి :
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్దిరోజులుగా ప్రకంపనలు సృష్టిస్తున్న తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో, అనూహ్యంగా అధికార కూటమి అఫెన్స్ నుంచి డిఫెన్స్ లోకి జారుకుంది. కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగుచూసిన నాటి నుంచి కూటమిలొని పార్టీలు ప్రతిపక్ష వైసీపీని ఓ ఆట అడుకున్నాయి. దీంతో ఈ వ్యవహారం కేవలం ఒక ఆధ్యాత్మిక భావోద్వేగ అంశంగానే కాకుండా, రాజకీయ అస్తిత్వ పోరాటంగా మారింది. ఈ నేపధ్యంలో కల్తీ నెయ్యి అంశంలో సిట్ (SIT), విచారణ, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, సీబీఐ ప్రమేయం వంటి అంశాలను అస్త్రాలుగా చేసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. నెయ్యిలో కల్తీ లేదని సిబిఐ తేల్చిచెప్పడం, కూటమి నేతలపై వైసీపీ మాటల యుద్దం ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ చేసింది. దీంతో ఈ సమయంలో తాము మెత్తబడితే వైసీపీ తన ఉనికే ప్రశ్నార్ధకంగా మార్చుతుందనుకున్న కూటమి నేతలు వైసీపీ వాయిస్ ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేయాలని నిర్ణయానికి వచ్చింది. ఈ నేపధ్యంలో అక్కడక్కడ వైసీపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కట్టడం, ఆ ఫ్లెక్సీలను వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించడం, అయనపై టిడిపి శ్రేణులు తిరగబడటం, ఇళ్లపై దాడులు చెయ్యడం వంటి ఘటనలతో రాష్ట్రాన్ని అట్టుడికించి చివరకు అంబటి రాంబాబును జైలుకు పంపింది. దీంతో ఇక్కడి నుంచే కూటమికి బ్యాడ్ టైం మొదలైంది.
కేవలం తిట్టిన వారికి జైలు, కొట్టి ఇళ్లపై దాడులు చేస్తే బెయిలా అంటూ కూటమి ప్రభుత్వాన్ని ఒక్క వైసీపీనే కాకుండా సీనియర్ కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణుకుమార్ లాంటి వారు కూడా ప్రశ్నించడం జనాల్లో వైసీపీకి కొంత ప్లస్ అయ్యింది. దీంతో ఈ వ్యవహారం ఇక్కడి నుంచే ఓ మలుపు తిరిగినట్లయ్యింది. ఇలా అందరి నుంచి కూటమిపై వ్యతిరేక వాయిస్ వినిపిస్తుండటంతో కూటమిలో తామెక్కరమే మాట్లాడుతున్నామని, జనసేన, బిజేపి ఎందుకు మాట్లాడటం లేదని జనసేన, బిజేపితో మాట్లాడించే ప్రయత్నం సిఎం చంద్రబాబు చేశారు. దీంతో పవన్ కూడా తెరపైకి వచ్చి ఎది మాట్లాడినా తానే మాట్లాడాలా... మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడరా అంటూ అసహానం వ్యక్తం చేశారు. పవన్ అసహనం, అగ్రహానికి తన సొంత అన్న ఎమ్మెల్సీ నాగబాబు పాత సీసాలో కొత్త సారా అన్న సామెత చందంగా పాత సమాచారమే మాట్లాడారు కానీ ఎక్కడా ఎప్పటిలా పరుష పదజాలంతో మాట్లాడలేదు. ఇక బిజేపి మాత్రం నోరు కూడా మెదపలేదు.
ఇంతలోనే ఇందాపూర్ డెయిరీ వ్యవహారం కూడా తెరపైకి రావడంతో వైసీపీకి మరింత బలం చేకూరినట్లయ్యింది. ఇందాపూర్ డెయిరీతో చంద్రబాబు కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ తో ఉన్న సంబంధాన్ని వైసీపీ బలంగానే ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఫలితంగా వెంటనే హెరిటేజ్ షేర్లు కూడా పతనమయ్యాయి. ఈ అన్యూహ పరిణామాలన్ని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామీ దెబ్బలేనని, దేవుడితో ఆటలాడితే ఫలితం ఎలా ఉంటుందంటే .. ఇలాగే ఉంటుందంటూ మరింత బలంగా వైసీపీ మాటల తూటాలు పేల్చింది. సొంత సంస్థ హెరిటేజ్ మ్యానిఫ్యాక్షరింగ్ యూనిట్ నుంచి కల్తీ నెయ్యి మీరు సరఫరా చేసి మాపై బురద జల్లుతారా అంటూ ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఈ పరిణామం ప్రజల్లోకి బలంగానే వెళ్లింది.

ఇందపూర్ తో హెరిటేజ్ కి ఉన్న సంబంధాలపై రాష్ర్ట వ్యాప్తంగా మాటల యుద్దం నడుస్తున్న నేపధ్యంలో అసెంబ్లీ సమావేశాలు రానే వచ్చాయి. ఈ సమావేశంలో ప్రతిపక్షం తప్పక కల్తీ నెయ్యి అంశాన్ని ప్రస్తావించి అధికార పార్టీని ఇరుకున పెడుతుందేమోనన్న అభిప్రాయం ఓ వైపు అధికార కూటమిలో నెలకొంది. బయట పడకపోయినా వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసి వెళ్లిపోవడంతో కొంత సంతషాన్నే నింపింది.కానీ మండలిలో తమపోరాటం కొనసాగుతుందని వైసీపీ చెప్పడం జరిగిపోయాయి. దీంతో మండలిలో ఇందాపూర్ డెయిరీ నెయ్యి సరఫరాపై చర్చకు వైసీపీ వాయిదా నోటీసు ఇచ్చింది. కానీ చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంతో ... తప్పక చర్చకు అనుమతించాలంటూ వైసీపీ ఛైర్మన్ పోడియాన్ని చుట్టూముట్టి ఆందోళనకు దిగాయి. కానీ అధికార పార్టీ సిద్దంగా లేకపోవడంతో మండలి చైర్మన్ ఈ తీర్మానాన్ని తిరస్కరించాల్సి వచ్చింది. ఇక్కడే టిడిపి చర్చకు వెనకడుగు వెయ్యడంతో వైసీపీ పైచేయి సాధించిందని అభిప్రాయం వ్యక్తమవుతొంది. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీని రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్రపన్నిన టీడీపీ, మండలిలో చర్చ అంటే ఎందుకు ఒప్పుకోలేదని వైసీపీ ప్రశ్నించింది. కేవలం చంద్రబాబు కుటుంబం నడుపుతున్న డెయిరీ ఈ వివాదాస్పద అంశంలో చర్చకు కేంద్రంగా నిలుస్తుందనే భయంతో పాటు ఎక్కడ అది తిరిగి తమ మెడకు వైసీపీ చుడుతుందోనన్న భయంతో పాటు ఇందాపూర్ పై చర్చ జరిగితే, వాస్తవాలు ప్రజలకు తెలిసి తమకు రాజకీయంగా, ఆర్థికంగా మరింత నష్టం వాటిల్లడం ఖాయమన్న భయాందోళన టిడిపిలో కనిపిస్తొంది.
మొత్తం మీద... దేవుడిని అడ్డం పెట్టుకుని వైసీపీని రాజకీయంగా తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి పేరుతో దెబ్బతీయ్యాలని చూస్తే ... అది తిరిగి తమ మెడకే చుట్టుకున్న చందంగా వ్యవహారం మారడంతో ... ఈ వ్యవహార నష్టం రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు కుటుంబానికి ఎలా ఉండనుందొ రానున్న రోజుల్లో చూడాల్సిందే.