- సిద్ధార్థరెడ్డి 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం...తీర్పును రిజర్వ్ ..
- హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించిన సుప్రీం ..
దిల్లీ :
రెండు దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ( Prathyusha Case) జైలుశిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. నిందితుడికి గతంలో హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించిన సుప్రీం (Supreme Court) ధర్మాసనం.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది.
హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి లు ప్రేమించుకున్నారు. అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లగా... సిద్ధార్థరెడ్డి ఇంజినీరింగ్లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7.30-8 గంటల మధ్య ఇద్దరూ విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష 24న చనిపోయారు. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థరెడ్డి డిశ్చార్జి అయ్యాడు. ఇరువురు కూల్ డ్రింక్ లో పురుగుమందు కలిపి తాగినట్లు పరీక్షల్లో గుర్తించారు. ఆర్గానోఫాస్ఫేట్ కారణంగా ప్రత్యూష మరణించారని.. ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై ఆర్గానోఫాస్ఫేట్ కారణంగా ప్రత్యూష మరణించారని... ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి వంటివి జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల బృందం నివేదిక అందించింది. దీని ఆధారంగా దర్యాప్తు జరిపిన సీబీఐ... నిందితుడిపై 306 (ఆత్మహత్యకు పురికొల్పడం), 309 (ఆత్మహత్యకు యత్నించడం) సెక్షన్ల కింద ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితుడు సిద్ధార్థరెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగారశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు చెప్పారు. దీనిపై సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా... జైలుశిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ, జరిమానాను రూ.50 వేలకు పెంచుతూ 2011 డిసెంబరు 28న తీర్పు వెలువరించింది.
అనంతరం దీనిపై ప్రత్యూష తల్లి సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై ఇటీవల విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేసింది. అయితే తాజాగా సిద్ధార్థ రెడ్డి నాలుగు వారాల్లోగా లొంగిపోవాలంటూ ఆదేశించింది. తీర్పు మాత్రం రిజర్వు చేసింది. మరి సుప్రీం తీర్పు అనంతరం నిందితుడు సిద్దార్ధరెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి విధించిన శిక్షనే ఖరారు చేస్తుందా లేక కొత్తగా శిక్షను విధిస్తుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.