Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

బడ్జెట్ లో బాబుకు భజన..వైసీపీపై బురద జల్లడం.. ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ చేసింది ఇదే...

16 Feb 2026
03:21 PM
487

బడ్జెట్ లో  అపద్దాలు, మోసాలు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి.. 
హామీలు అమలు చెయ్యకుండానే రాష్ట్రాన్ని అప్పుల మయం చేశారు...
మహిళలను, యువతను, రైతులను మోసం చేశారు...
ప్రభుత్వం తక్షణం శ్వేత పత్రం విడుదల చెయ్యాలి..
వైసీపీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ రెడ్డి హాట్ కామెంట్స్ ...


కడప   : 

కూటమి ప్రభుత్వ బడ్జెట్ చూస్తే గతంలో మాదిరే అపద్దాలు, మోసాలు, కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయని, బడ్జెట్ లో బాబుకు భజన..వైసీపీపై బురద జల్లడమే 
ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ చేసిందని  వైసీపీ కడప జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కడపలో అయన మీడియాతో మాట్లాడుతూ 
గత 3 యేళ్లుగా ఆడబిడ్డ నిధి అనేది ఉసే లేదని, నిరుద్యోగ భృతిని పట్టించుకున్న పరిస్ధితి లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 యేళ్లకు ఇస్తామన్న  పెన్షన్ పథకం అతీగతి లేదని, మిగిలిన వాటిని అరకొర కేటాయింపులే చేశారని మండిపడ్డారు. సూపర్ సిక్స్ మాత్రమే కాదు ఎన్నికల సమయంలో చంద్రబాబు 136 హామీలు ఇఛ్చారని,  136 హామీల అమలు కథ అటుంచితే సూపర్ సిక్స్ హామీల అమలే గతి లేదని విమర్శించారు. రెండేళ్లలోనే 3.25 లక్షల కోట్ల అప్పులు చేసి ఎపిని అప్పుల పాలు చేశారని, తమ వైసీపీ ప్రభుత్వంలోను  3.19 లక్షల కోట్లు అప్పులు చేశామని, కానీ  సంక్షేమ కార్యక్రమాలను మ్యానిఫెస్టోలో చెప్పినట్లు అమలు చేసి చూపామన్నారు. కానీ హామీల అమలే చెయ్యకుండా అంత అప్పు ఎందుకు చేశారో చెప్పాలన్నారు. రాష్ర్టంలో 65 శాతం మంది వ్యవసాయం పై అధారపడ్డరని, గత ప్రభుత్వంలో వ్యవసాయానికి పెద్ద పీఠ వేసి రైతు భరోసా, పెట్టుబడి నిధి కింద సాయం చెయ్యడం జరిగిందన్నారు. భూసార పరీక్షలు  మొదలు విత్తనాలు, ఎరువులు తప్పక సకాలంలో ఇవ్వడం జరిగిందన్నారు. కానీ  ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో యూరియా కోసం కోట్లాడుకోవల్సిన పరిస్ధితని, కనీసం డిఎపి కూడా ఇఛ్చే పరిస్ధితి లేదని, ఈ ప్రభుత్వంలో ముందస్తు ప్రణాళిక, కేటాయింపులు కూడా ఉండటం లేదని విమర్శించారు. అంతేకాకుండా రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చే పరిస్ధితి లేదని, రైతులకు ఇచ్చే సున్నా వడ్డీ అసలుకే లేదని, అన్ని పంటలకు కనీస మద్దతు ధర అసలే లేదన్నారు. ఈ కారణంగానే కూటమి ప్రభుత్వ హాయంలో వ్యవసాయ పంటలే కాకుండా ఉద్యాన పంటలు సాగు చేసిన రైతులు నష్టపోయిన పరిస్ధితిని చూస్తున్నామన్నారు. రాయలసీమ నీరందించే రాయలసీమ ఎత్తిపోతల పథకం వంటి ప్రాజెక్టుల ప్రస్తావన లేదని, నీరు రాకుంటే తెలంగాణా వాళ్లు ఉన్న నీరు తీసుకుంటే మనకు నీళ్లు వచ్చే పరిస్ధితి లేదన్నారు. ఇలాంటి ప్రాజెక్టులను ఓటుకు నోటు కేసులో రేవంత్, చంద్రబాబులు తోడు దొంగలుగా ఉండటం వల్ల  రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టారని ఆరోపించారు. వైఎస్ఆర్ హాయంలో నాభూతో నా భవిష్యత్తు అన్నట్లుగా పాలన సాగిందని, ఆరోగ్య శ్రీ ద్వారా పేదలందరికి మెరుగైన వైద్య అందేలా చేస్తే  ఈ కూటమి  ప్రభుత్వం నిర్వీర్యం చేసే పని చేస్తుందని మండిపడ్డారు. గతంలో ఆరోగ్య శ్రీ 2 లక్షల వరకే ఉంటే, వైఎస్ జగన్ రూ. 25 లక్షలకు పెంచారని, ఇప్పుడు ఈ పథకాన్ని అసలే లేకుండా చేసి.. కేంద్రం ప్రవేశపెట్టిన పథకమే ఇక్కడ అమలు  చేసే పని చేస్తున్నారన్నారు.  గత ప్రభుత్వం ఆర్ధిక విధ్వంసం అంటూ వైసీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, వాస్తవానికి గత ప్రభుత్వానిది విధ్వంసం కాదని, ఇప్పుడు ఈ ప్రభుత్వం  చేసేదే అసలైన విధ్వంసమన్నారు. సంపద సృష్టి పేరుతో వచ్చి రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తున్నారని, తల్లికి వందనం కింద 30 లక్షల మంది పిల్లలకు ఎగరగొట్టారని, ఈ యేడాది కూడా రూ.1312 కోట్లు అవసరం ఉంటే... రూ.846 కోట్లే కేటాయించారని, రెండవ యేడాది అరకొర గానే అమలు చేశారన్నారు.  రెండేళ్లు కావొస్తున్నా ఒక్క కొత్త రేషన్ కార్డు లేదని, ఒక ఇళ్లు కట్టించింది లేదన్నారు.  కూటమిది లోపభూయిష్టమైన బడ్జెట్ తప్ప మరొకటి కాదని, ప్రభుత్వం తక్షణం శ్వేత పత్రం విడుదల చెయ్యాలని అయన డిమాండ్ చేశారు. కూటమి మోసాలు, అపద్దాలు అన్ని ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. 

 

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!