గన్నవరం :
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా గన్నవరం ఎయిర్ పోర్టులో విమానం దిగడానికి ఇబ్బంది ఎదురైంది. దీంతో కాసేపు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. అనంతరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది.
బిల్ గేట్స్‌తో పాటు ఫౌండేషన్‌కు చెందిన ఆరుగురు ప్రతినిధుల బృందం ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో గన్నవరం చేరుకున్న విమానానికి పొగమంచు కారణంగా విజిబిలిటీ సమస్య ఎదురైంది. ప్రతికూల వాతావరణం కారణంగా విజయవాడ చుట్టూ బిల్ గేట్స్ స్పెషల్ ఫ్లైట్ చక్కర్లు కొట్టింది. అనంతరం గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్, జిల్లా అధికారులు బిల్ గేట్స్‌కు స్వాగతం పలికారు.
