విజయవాడ :
కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కమ్మని పాలన కామెంట్స్ పై సిఎం చంద్రబాబును కలిసి వివరణ ఇచ్చారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం,పాలనపై ఆదినారాయణ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై, సిఎం హెచ్చరికల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల తిరుపతిలో జరిగిన పార్టీ కార్యక్రమంలో జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూటమిలో బీజేపీ ప్రాధాన్యత, కుల సమీకరణాలపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. కానీ ఈ వ్యాఖ్యలపై టిడిపికి,ప్రత్యేకించి చంద్రబాబుకు చిక్కులే తెచ్చిపెట్టాయి. ఈ కామెంట్స్ స్వయానా బిజేపి రాష్ర్ట అధ్యక్షుడు మాధవ్ సమక్ష్యంలోనే అయన కామెంట్స్ చేసినా ...అనంతరం ఎమ్మెల్యే ఆది కామెంట్స్ అయన వ్యక్తిగతం... పార్టీకి సంబంధం లేదంటూ వ్యాఖ్యానించారు. కానీ పార్టీ సమావేశంలో....స్వయానా అధ్యక్షుడి సమక్ష్యంలో చేసిన కామెంట్స్ కు పార్టీకి సంబంధం లేదనడం ఎంటని అందరు ప్రశ్నలు గుప్పించారు.

కానీ గతంలో వైసీపీ నుంచి పార్టీ మారింది మొదలు అయన నోటి పవర్ ఎంటో అందరికి రుచిచూపిస్తూనే ఉన్నారు. ప్రత్యేకించి వైసీపీ అధినేత వైఎస్ జగన్ నే కాదు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా తాను జమ్మలమడుగులో మోజార్టీ తెప్పిస్తే గెలిచారంటూ వ్యాఖ్యానించి తనకు గిట్టని వారిపై ఏ స్థాయిలోనైనా విమర్శలు చేస్తారని మాటల్లో చెప్పకనే చెబుతూ వచ్చారు. ఇక టిడిపిలో చేరిన తరువాత అయితే ఆది ఓ రేంజ్ లో రెచ్చిపోయారు.మంత్రి అయ్యాకా అయన నోరు తెరిస్తే చాలు వైఎస్ జగన్ , అయన సతీమణిని టార్గెట్ గా చేసుకుని అనేక విమర్శలు చేస్తూ వచ్చారు. దీంతో రాష్ర్టంలో అందరు కూడా ఎమ్మెల్యే ఆది నోరు చాలా పెద్దది అంటూ మాట్లాడుకోవడం తెలిసిందే.
కానీ అయన నోటి పవర్ దెబ్బ ఎలా ఉంటుందొ టిడిపి అధినేత చంద్రబాబు కూడా తొలిసారి ఇప్పుడే రుచిచూశారు. ఇంత కాలం చంద్రబాబుకు పడరానీ వాళ్లను తిడితే సంబరపడిన చంద్రబాబుకు కమ్మని మాటలు మాత్రం అయనలో చేదుని నింపినట్లయ్యింది. అలాగని నేరుగా చేసిన వ్యాఖ్యలు కూడా కాదు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పలు వివాదాల్లో ఉన్న వారిలో బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి ఒకరు. తాజాగా చంద్రబాబు సొంత సామాజిక వర్గం కమ్మ కులంపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. నేరుగా చేస్తే.. తన రాజకీయ జీవితం దెబ్బ తింటుందనే “దూరా" లోచనతో ఒక పధకం ప్రకారం ఈ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం "కమ్మ” గా ఉందంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వెటకారంగానే వ్యాఖ్యలు చేశారు. ఇక ఎమ్మెల్యే ఆది నోటి నుంచి సూటిగా విమర్శలు వింటే చంద్రబాబు పరిస్ధితి ఎంటన్నది ఇప్పుడు చర్చ.
అయితే ఆది వ్యాఖ్యలు కలకలం రేపడంతో ...కూటమి నేతలు మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలని, వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని సీఎం క్లాస్ తీసుకున్న అనంతరం సిఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే ఆది భేటి కావడం చర్చనీయాంశంగా మారింది. మరి ఆదినారాయణరెడ్డికి జిల్లాలో ప్రత్యేకించి జమ్మలమడుగులో ఎదురువుతున్న సమస్యలను సిఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో పాటు తన వ్యాఖ్యల వెనక కారణాలు తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే ఆది మాటలు విన్న చంద్రబాబు కమ్మని వ్యాఖ్యల పట్ల మాత్రం కొంత అసహానం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎదిఎమైనా ఒక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీ అధినేత వద్ద వివరణ ఇవ్వడం ఎంటో అంటూ చర్చించుకుంటున్న వారు లేకపోలేదు.