మాజీ సైనికుడి ఇళ్లు...
స్వాతంత్ర్య దినోత్సవం ఆర్ధరాత్రి కూల్చడం దారుణం ....
దళితులతో పెట్టుకున్న వారు పతనమే ..
రాష్ర్ట వైసీపీ సంయుక్త కార్యదర్శి కిషోర్ బూసిపాటి హెచ్చరిక
కడప :
కడప నగరంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేక హిట్లర్ పాలన సాగుతుందా అన్న అనుమానాలున్నాయని వైసీపీ అన్నమయ్య జిల్లా పరిశీలకులు సురేష్ బాబు విమర్శించారు. కడప నగరంలోని ఎర్రముక్కపల్లె సమీపంలోని కందిపాళెంలో మాజీ సైనికుడు సట్టి నరసింహులు ఇంటిని అక్రమంగా కూల్చిన ఘటనను నిరసిస్తూ అఖిలపక్ష్యం అధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్ష శిభిరాన్ని అయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా వైసీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఈ రోజు దీక్షకు కూర్చున్న నాయకులకు సంఘీభావం తెలిపిన సురేష్ బాబు మాట్లాడుతూ రాజ్యాంగం రచించిన రోజైన స్వాతంత్ర్య దినోత్సవ రోజు ఆర్ధరాత్రి ఓ మాజీ సైనికుడి ఇంటిని కూల్చడం దారుణమన్నారు. ఈ పరిస్ధితిని చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక హిట్లర్ పాలనలో ఉన్నామా అన్న అనుమానాలు కలుగుతుందన్నారు. ప్రత్యేకించి కడప నగరంలో కూటమి పాలర వచ్చాకా కుటిల రాజకీయాలు ఎక్కువయ్యాయని, దౌర్జన్యాలు, దోపిడీలు, దాడులు అధికమయ్యాయని విమర్శించారు. ఓ మాజీ సైనికుడు, దళితులకు ఇంకా ఎదైనా కావల్సింది చెయ్యాల్సింది పోయి అదే దళిత మాజీ సైనికుడి ఇంటి కూల్చడం దుర్మర్గమైన చర్యన్నారు. సరైన అధారాలుండి న్యాయపరంగా కుల్చానుకుంటే పగటి పూట ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు. ఆర్ధరాత్రి గంజాయి బ్యాచ్ ని అడ్డం పెట్టి ప్రోక్లెయిన్లతో కూల్చాల్సిన పని ఎముందన్నారు. కలెక్టరేట్ కు కూత వేత దూరంలో ఈ ఘటన జరగడం, ఘటన జరిగిన నాటి నుంచి రిలేదీక్షలు చేస్తున్నా అధికారులు స్పందించడం లేదని, న్యాయం చెయ్యాలని అడిగిన వారిపైనే కేసులు నమోదు చెయ్యడం దారుణమన్నారు. కేసులు పెడితే నోరు మూసుకుంటారన్న ఉద్దేశ్యంతోనే ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూడా 35 కేసులు కట్టారని, ఈ పరిస్ధితి కడప నగరంలో మరి దారుణంగా ఉందన్నారు. ఒక మాజీ సైనికుడి పరిస్ధితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్ధితి మరి దారుణంగా ఉందన్నారు.
దళితులతో పెట్టుకున్న వారు పతనమే : కిషోర్ బూసిపాటి, రాష్ర్ట వైసీపీ సంయుక్త కార్యదర్శి :
దళితులతో పెట్టుకుని బాధపెట్టిన వారందరు పతనమైన చరిత్రను మనమందరం చూస్తున్నామని, ఇప్పుడు కడప నగరంలో మాజీ సైనికుడు సట్టి నరసింహులు ఇంటిని కూల్చిన వారు కూడా పతనం కాకతప్పదని రాష్ర్ట వైసీపీ సంయుక్త కార్యదర్శి కిషోర్ బూసిపాటి హెచ్చరించారు. ఇంటి కూల్చివేతను నిరసిస్తూ స్వయంగా ఈ రోజు దీక్షను చేపట్టిన కిషోర్ మాట్లాడుతూ ఓ వైపు స్వాతంత్రం వచ్చిన రోజని అందరు పండగ చేసుకుంటే మాజీ సైనికుడు ఇంటి కూల్చి ఆ కుటుంభాన్ని మాత్రం విషాదాన్ని నింపారన్నారు. ఎమ్మెల్యే మాధవీరెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డిల ప్రోద్బలంతో గంజాయి బ్యాంచ్ ఆర్ధరాత్రి అడ వారిని, పిల్లలను బయటకు లాగేసి అరాచకం సృష్టించి ఇంటిని నేలకూల్చారన్నారు. కానీ ఇంత జరిగినా అధికారులు స్పందించకపోవడం దారుణమని, దీన్ని చూస్తే కడపలో ఆటవిక పాలన సాగుతుందనిపిస్తొందన్నారు. ఈ ఆటవిక ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ఖండిస్తుందని, తక్షణం అధికారులు బాధ్యులపై చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో ప్రజా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైసీపీ అండగా ఉంటుందని, తప్పక న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, సిపిఐ నగర కార్యదర్శి వెంకటశివ, కార్పోరేటర్లు కె. బాబు, సుబ్బరాయుడు, వైసీపీ నాయకులు వినోద్ కుమార్, డాక్టర్ పెంచలయ్య, తదితరులు పాల్గొన్నారు.