Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

దద్దరిల్లిన ఏపీ అసెంబ్లీ.. నినాదాలతో హోరెత్తించిన వైసీపీ.. గవర్నర్ ప్రసంగం బాయ్‌కాట్ ....

11 Feb 2026
12:10 PM
115

Article Image

 

అమరావతి  : 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అనుకున్నదే జరిగింది. వైసీపీ సభ్యులు.. అసెంబ్లీకి వచ్చారు. సభకు వచ్చినప్పటి నుంచే జగన్ సహా వైసీపీ సభ్యులు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి అడ్డుతగిలారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రతిపక్ష హోదా, రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై వైసీపీ నేతలు నినాదాలతో హోరెత్తించారు. సభ్యుల హక్కులను కాపాడాలంటూ చేపట్టిన ఆందోళన .. నిరసనల మధ్యే కొనసాగుతున్న గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది. ఈ క్రమంలో గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు బాయ్‌కాట్ చేస్తూ.. వాకౌట్ చేశారు. అయినా గవర్నర్ ఏమాత్రం ఆగకుండా.. తన ప్రసంగం కంటిన్యూ చేశారు.  ఇదీ ఒక ప్రసంగమేనా అనుకుంటూ.. గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేశారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

Article Image

తమకు మైక్ ఇవ్వట్లేదని ప్రతిసారీ చెబుతున్న వైసీపీ.. ఈసారి మైక్ అవసరం లేకుండానే సభలో కొంత ఆందోళన చెయ్యగలిగింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు 11 మందే ఉన్నా.. గట్టిగానే నినాదాలు చేశారు. మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానం రద్దు చెయ్యాలీ, శాంతి భద్రతలు కాపాడాలని అరిచారు. అలాగే... వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలా వారు అరుస్తుంటే.. గవర్నర్ ప్రసంగానికి కొంత ఇబ్బంది కలిగిన అయన తన ప్రసంగానికి బ్రేక్ ఇవ్వకుండా కొనసాగించారు. 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!