Sunday, 10 May 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

ధ్వంసం, దాడులు, పెట్రోలు బాంబులు వేసిన వారికి స్టేషన్ బెయిల్ ... ! తిట్టిన వారికి జైలు ... !!

10 Feb 2026
05:25 PM
77


ఇలాంటి సంప్రాదాయం మంచిది కాదు ....
రాజకీయాలుంటే మాట్లాడుకోవాలి గానీ ... 
తిరుమల లడ్డూపై ఆరోపణలు సరైంది కాదు ..... 
మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్
రాజమండ్రి సెంట్రల్ జైల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పరామర్శ..

రాజమండ్రి   : 
ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకా కొత్త సంప్రాదాయాన్ని తీసుకువచ్చారని, ఇళ్లు ధ్వంసం చేసి పెట్రోలు బాంబులతో దాడి చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చారని, తిట్టిన వారిని సెంట్రల్ జైల్ కు పంపారని తన మార్క్ కామెంట్లతో మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శలు గుప్పించారు.  రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ పై ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును ఉండవల్లి పరామర్శించారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ  కేవలం రాజకీయ కక్షతోనే అంబటి రాంబాబును జైలుకు పంపించారని ఆరోపించారు. అంబటిపై 35 చోట్ల కేసులు పెట్టడం, సెంట్రల్ జైలుకు పంపడం ఇదంతా కొత్త ట్రెండ్ అని, చాలా టూ మచ్ గా వ్యవహరించారని అన్నారు. దానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని,  ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఎప్పటి నుంచో అంబటితో పరిచయం ఉందని, అందుకే ములాఖత్ అయ్యేందుకు వచ్చానని అన్నారు. వారం క్రితమే రావాల్సి ఉందని…రాలేకపోయానని చెప్పారు. ఈ కేసు వల్ల అంబటికి, వైసీపీకి లాభం జరిగిందని అన్నారు. దాదాపు 6 గంటల పాటు అంబటి ఇంటిపై పెట్రోల్ బాంబుతో దాడి చేశారని, అంత సీరియస్ కేసులో దాడి చేసిన వ్యక్తులకు స్టేషన్ బెయిల్ ఇవ్వడం తాను తొలిసారి వింటున్నానని అన్నారు. మాటలు మాట్లాడిన అంబటి జైలు.. దాడులు, పెట్రోలు బాంబులు వేసిన వారికి బెయిల్ కొత్త సంప్రదాయంగా ఉందన్నారు. 

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై   ఉండవల్లి స్పందించారు.  తిరుమల లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ కూడా చెప్పిందని గుర్తు చేశారు. అయినా సరే చంద్రబాబు ఆ వయస్సులో అబద్ధాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు.  ఇక రాజకీయాల ఉంటే రాజకీయాల వరకు మాట్లాడుకోవాలి గానీ ..ఇలా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటం సరైంది కాదన్నారు.  చంద్రబాబు దైవ ద్రోహం చేస్తున్నాడని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. బాత్రూమ్ లో వాడే కెమికల్స్ ఆ నెయ్యిలో వాడారని చంద్రబాబు చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని, ఇలాంటి మాట్లాడితేనే చాలా కాలం కిందట చాలా మంది రకరకాలుగా చెప్పారని, అలాంటిది పదే పదే జంతువుల కొవ్వూ వాడారని అనడం దారుణంగా ఉందన్నారు. కానీ  చంద్రబాబు ఇలా మాట్లాడడం తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. జంతువుల కొవ్వు లేదని సిట్ రిపోర్టులో చెప్పినా…చంద్రబాబును ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!