రేవంత్ కు సీమ లిఫ్ట్ తాకట్టుపెట్టడం వల్లే ...
హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబ్ తగలబెట్టారు ...
ఓటుకు నోటు సాక్ష్యాలు దగ్దం చేశారు...
కడప వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథరెడ్డి హాట్ కామెంట్స్
కడప :
హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్దంపై కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ సీనియర్ నేత కడప జిల్లా వైసీపీ అధ్యక్షులు పి. రవీంద్రనాథరెడ్డి. రాలయసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టడం వల్లే హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబ్ తగలబెట్టారని ఆరోపించారు. ఓటు నోటు కేసులో తెలంగాణా, ఎపి సిఎంలు ఇద్దరు పట్టుబడటం వల్లే, ఈ కేసుకు సంబంధించి ఆధారాలన్ని హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉండటంతో వాటిని తగలబెట్టించారన్నారు. ఇందుకు కోసం ఎపి సిఎం చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తాకట్టు పెట్టారన్నారు. ఇటీవల తెలంగాణా అసెంబ్లీలో స్వయానా సిఎం రేవంత్ రెడ్డి తాను చెప్పడం వల్లే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిచిపోయాయని చెప్పడం, ఈ వ్యాఖ్యలు ఎపిలో దుమారం రేపడం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఉన్న ఫలంగా హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబ్ ఆగ్నిప్రమాదం చోటు చేసుకోవడం, ఓటుకు నోటు కేసులో ఆధారాలన్ని దగ్దం కావడంతో కడప జిల్లా వైసీపీ అధ్యక్షులు రవీంద్రనాథరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా దేవుడు చంద్రబాబునాయుడుకు 4 సార్లు సిఎం అయ్యే అవకాశం ఇచ్చారని, ఇన్ని అవకాశాలు వస్తే ఎపి అభివృద్దికి కృషి చెయ్యకుండా ఎపిని తాకట్టుపెట్టడం, రాయలసీమను ఏడారిగా మార్చడం దారుణమన్నారు. ప్రజలు తప్పక గుణపాఠం చెబుతారన్నారు.