Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఎపికి నష్టమే ... కడప వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథరెడ్డి హాట్ కామెంట్స్

10 Feb 2026
02:48 PM
129


*చంద్రబాబు సిఎం అయ్యాకే అల్మట్టి ఎత్తు పెరుగుతు వస్తొంది ...
*ఇప్పుడు మళ్లీ కర్ణాటక 150 టిఎంసీలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నా....
*చంద్రబాబు అభ్యంతరం తెలపడం లేదు....
*ఇతర మహారాష్ర్ట, తెలంగాణా రాష్ట్రాలు సుప్రీంకోర్టులో సవాల్ చేసినా...
*ఎపి మాత్రం అపే పరిస్ధితి కనిపించడం లేదు .....
*ఎప్పుడు చంద్రబాబు సిఎం అయినా ముంచేసే కార్యక్రమమే చేస్తారు .....

కడప  : 

చంద్రబాబునాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఎపికి నష్టమేనని, రాయలసీమ ఏడారిగా మారేందుకు కూడా అయనే కారణమని కడప జిల్లా వైసీపీ అధ్యక్షులు రవీంద్రనాథరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పోడించి సిఎం అయిన నాటి నుంచి ఎపికి నష్టమేనన్నారు. చంద్రబాబుకు ముందుకు అల్మట్టి అనేది మామూలు అనకట్టని, దాని సామార్ధ్యం 17.82 టిఎంసీల సామార్ధ్యం కాగా,   చంద్రబాబునాయుడు సిఎం అయ్యాకా అల్మట్టి ఎత్తు ను 519 అడుగుల ఎత్తుకు పెంచడం వల్ల 129.78 టిఎంసీలకు దాని సామార్ధ్యం పెంచడం జరిగిందన్నారు. కర్నాటకకు చెందిన దేవెగౌడ్ ను ప్రధాని చేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు అల్మట్టి ఎత్తును పెంచుతుంటే కనీసం అడ్డుకోవాలనే ప్రయత్నం కూడా చెయ్యలేదన్నారు. 2014 మళ్లీ అయ్యాకా చంద్రబాబు సిఎం అయ్యాకా మరోమారు అల్మట్టి డ్యాం  సమార్ద్యాన్ని 129.72 టిఎంసీల నుంచి 279.72 టిఎంసీలకు పెంచేందుకు డీపిఆర్ ను సిద్దం చెయ్యడం జరిగిందని, కానీ ఈ సమయంలోను అయన అడ్డుకునే ప్రయత్నం చెయ్యలేదని విమర్శించారు. ఇఫ్పుడు అల్మట్టి ఎత్తు 129.72 టిఎంసీల నుంచి 279.72 టిఎంసీలకు పెంచితే  రాయలసీమకు తీవ్ర అన్యాయం జరగనుందని మండిపడ్డారు.  ఎవరైనా ఎపికి న్యాయం చెయ్యాలని చూస్తే టిడిపి నాయకులతోనే పిల్ వేయించి అడ్డుకునే ప్రయత్నం చేస్తారన్నారు. ఇది వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోతిరెడ్డిపాడు సామార్ధ్యం పెంచాలని చూస్తే తెలంగాణా వారితో పిల్ వేయించారని, ఇఫ్పుడు వైఎస్ జగన్ మోహాన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడితే అడ్డుకట్ట వేయించారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఎపిని ముంచే కార్యక్రమం చేస్తునే వస్తున్నారన్నారు. ఇఫ్పుడు శ్రీశైలంలో 800 అడుగుల నుంచి తెలంగాణా దిండి, కల్వకుర్తి, తదితర ప్రాజెక్టుల ద్వారా నీటిని తోడే ప్రయత్నం చేస్తుంటే ఎపి ప్రభుత్వం మాత్రం రాయలసీమ లాంటి ఎత్తిపోతల పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుందన్నారు. ఎపికి 811 టిఎంసీల నీటి కేటాయింపులు ఉండగా, మరో 450 టిఎంసిల నీరు నది పరివాహ ప్రాంతం నుంచి లభ్యమవుతుందని, కానీ ఎగువన నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల ఈ నీటి లభ్యత ప్రాశ్నార్ధకంగా మారుతుందన్నారు. ఇప్పుడు 800 అడుగుల స్థాయి నుంచి నీటిని తీసుకోకపోతే రాయలసీమ ఏడారి అయ్యే ప్రమాదం పొంచి ఉందని, లేకపోతే భావతరాలు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందన్నారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల భవిష్యత్తు అవసరాల కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎంతో అవసరమని, ఇది చేపట్టకపోతే రాయలసీమ ఏడారయ్యే ప్రమాదం తప్పదని హెచ్చరించారు. దేవుడు 4 సార్లు సిఎం అయ్యే అవకాశం ఇచ్చారని, ఇఫ్పటికైనా ఇలాంటి నష్టం కలిగించే పనులు మానుకుని మంచి చెయ్యాలని, లేనిపక్ష్యంలో ప్రజలు అన్ని గమనిస్తున్నారని, త్వరలోనే తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.  

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!