Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

అంబటి రాంబాబుకు బెయిల్ .. అయినా జైలుకే .. !

09 Feb 2026
08:15 PM
119

 

*    సీఎంపై వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబుకు బెయిల్.. 

 

GUNTUR   : 

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఒక కేసులో ఊరట లభించినా, మరో కేసును పోలీసులు తెరపైకి తీసుకురావడంతో మళ్లీ జైలు తప్పలేదు. దీంతో ఆయన జైలు నుంచి ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు ఇవాళ‌ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి బయటకు వస్తారని అంతా భావించారు. అయితే, ఆయన బెయిల్‌పై విడుదలవుతున్న సమయంలోనే పట్టాభిపురం పోలీసులు మరో కేసులో రంగప్రవేశం చేశారు. గతంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలపై నమోదైన కేసులో పీటీ వారెంట్‌పై అంబటిని స్పెషల్ జ్యుడీషియల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం, ఆయనకు 14 రోజుల పాటు అంటే ఈ నెల‌ 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

సీఎంపై వ్యాఖ్యల కేసులో ఈ నెల‌ 1న అరెస్టయిన అంబటి, అప్పటి నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఒక కేసులో బెయిల్ వచ్చినా, మరో కేసులో రిమాండ్ పడటంతో పోలీసులు ఆయన్ను తిరిగి రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. కాగా, అంబటి రాంబాబుపై రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50కి సైగా కేసులు నమోదైనట్లు సమాచారం.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!