Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

అధికార మథంతో మాజీ సైనికుడి ఇంటిని కూల్చారు... టిడిపి సీనియర్ నేత లక్ష్మీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

09 Feb 2026
03:18 PM
42


- కందిపాళెంలో  దీక్షలకు మద్దతు పలికిన లక్ష్మీరెడ్డి...
-ఇళ్లు కూల్చివేతను తప్పక పార్టీ దృష్టికి తీసుకెళ్తానని హామీ...
-బాధిత కుటుంభాలకు అండగా ఉంటానని భరోసా ...

Article Image

 

కడప   : 
కడప నగరంలోని కందిపాళెంలో మాజీ సైనికుడు దివంగత నరసింహులుకు చెందిన ఇంటి అధికార మథంతో అధికార పార్టీ నాయకులు కూల్చివేయడం దారుణమని టిడిపి సీనియర్ నేత లక్ష్మీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప నగరంలోని కందిపాళెంలో ఇంటిని కూల్చివేతను నిరసిస్తూ కుటుంబ సభ్యులు చేపట్టిన దీక్షా శిభిరానికి చేరుకుని వారికి మద్దతు పలికారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేదల కోసం పుట్టిన పార్టీని, కానీ కోందరు అక్రమార్కలు పార్టీలో చేరి పార్టీని పేదలకు దూరం చేస్తున్నారని ఆరోపించారు. ఆర్ధరాత్రి సమయంలో గంజాయి ముఠాలు అరాచకం సృష్టించాయని, ఇంట్లో వస్తువులను చిన్నాభిన్నం చేసి ఇంటిని పూర్తిగా నేల మట్టం చెయ్యడం దారుణమన్నారు. దాడి చేసి ఇంతంటి అరాచకం సృష్టిస్తే బాధ్యలను అరెస్ట్ చేయకుండా  సంబంధం లేని వారిని అరెస్ట్ చెయడం పోలీసులకు అలవాటుగా మారిందన్నారు. పోలీసుల తీరును కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఇలాంటి దౌర్జన్యం,  బలవంతపు చర్యలకు పాల్పడితే తప్పక వారికి అండగా ఉంటామని, 
పార్టీ కూడా ఇలాంటివి సహించదని, కానీ కొంత అక్రమార్కులు ఇలాంటి చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ర్ట సంయుక్త కార్యదర్శి కిషోర్ బూసిపాటి, సిపిఐ నగర కార్యదర్శి వెంకటశివ, తదితరులు పాల్గొన్నారు. 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!