-మాజీ మంత్రి "ఆది" వ్యాఖ్యలతో కూటమిలో ప్రకంపనలు...
-అసలే లడ్డూ కల్తీ విషయంలో పట్టిపటనట్లుగా ఉంటున్న బిజేపి....
-ఇప్పుడు కమ్మని మాటలతో మరింత చేదెక్కిన కూటమి ......
Andhra pradesh :
గతంలో ఎప్పుడో కడప జిల్లాలో బాంబు పేళుల్లు అంటేనే జమ్మలమడుగు గుర్తుకువచ్చేది. కానీ ఇఫ్పుడు బాంబులతో అక్కరలేదు. ఆ నియోజకవర్గ బిజేపి ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి మాటలే బాంబుళ్లా పేలుతున్నాయి. ఇప్పటి వరకు ఒక వైపే బాంబులు విసిరేవారు. అది ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహాన్ రెడ్డిపై మాత్రమే మాటల తూటాలు పేల్చేవారు. కానీ ఇప్పడే అదే బిజేపి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఇప్పుడు సొంత కూటమిపైనే మాటల బాంబులు వేయడం కూటమి నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తొంది. ఇంత కాలం కమ్మగా సాగిన కూటమి పయనం ఇఫ్పుడు చేదిక్కెన చందంగా మారింది.
తిరుపతిలో ఆదివారం జరిగిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన కమ్మని వ్యాఖ్యలు కూటమిని ఐక్యతపై అనుమానాలు రేకెత్తించేలా చేశారు. ఒక కులం పెత్తనం ఏపీలో నడుస్తుందని ఆయన అనడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. అధికార పార్టీని ఇరకాటంలోకి నెట్టినట్లయింది. ఆదినారాయణ రెడ్డి ఏ ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ.. ఆంధ్రప్రదేశ్ లో కమ్మ సామాజికవర్గం పెత్తనం ఎక్కువ ఉందంటూ ఆయన నేరుగానే వ్యాఖ్యలు చేసి తన అసంతృప్తిని, అసహనాన్ని బయటపెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితులున్నాయా? అన్న దానిపై ఇప్పుడు కూటమిలోని మూడు పార్టీల్లో లోతైన చర్చ దారితీసింది.
ఆది కావాలనే ఈ వ్యాఖ్యలు చేశారా ... ?
బిజేపి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అంతర్గత సమావేశంలో చేయ్యాల్సిన వ్యాఖ్యలు ఇలా కార్యకర్తల సమావేశంలో చెయ్యడం ఇఫ్పుడు చర్చనీయాంశంగా మారింది. కూటమిగా అధికారాన్ని చేపట్టిన సందర్బంలో ఏదైనా ఇటువంటి ఇబ్బందులుంటే ముందుగా అంతర్గత సమావేశాల్లో చర్చించాల్సి ఉంటుంది. కానీ నేరుగా ఈ వ్యాఖ్యలు చేశారంటే ఆదినారాయణ రెడ్డి ఏదో మనసులో పెట్టుకుని అలా మాట్లాడి ఉంటారని కొందరు అనుమానిస్తున్నారు. ఇటీవల జమ్మలమడుగు నియోజకవర్గంలో నాడు టీడీపీలో పనిచేసి ప్రస్తుతం బేజేపీలో ఉన్న ఒక కీలక నేత, ఎంపి కంపెనీ చెందిన సామాగ్రపై ఆయన వర్గీయులు దాడులు కూడా చేసిన సంగతిని ప్రస్తావిస్తున్నారు. ఆయన వెనక రాష్ట్ర టీడీపీ నేతలున్నారని ఆదినారాయణ రెడ్డికి ఏదైనా అనుమానం రావడం వల్ల ఇలా మాట్లాడారా అన్నది కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. కూటమిలో బీజేపీ లేకపోతే టీడీపీ, జనసేన లేవంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ర్ట అధ్యక్షుడి ఎదుటే ఎందుకు ... !
మరొకవైపు కూటమి అంటే కులాలు ఉండకూడదని, అందరినీ కలుపుకుని వెళితేనే రాజకీయంగా లాభం చేకూరుతుందని ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అన్ని కులాలను కలుపుకుని వెళ్లకుండా ఒక కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతల పెత్తనం ఎంటని అయన ప్రశ్నించడం వెనక అసలు సూత్రధారులు కూడా ఎవరైనా ఉన్నారా అన్నది ఇప్పుడు చర్చ నడుస్తొంది. ఆదినారాయణ రెడ్డి కూడా టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన వారే. ఆయనకు నేటికీ టీడీపీ అగ్రనేతలతో సత్సంబంధాలున్నాయి. అలాంటి ఆదినారాయణ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారంటే ఏదో బలమైన కారణముండి ఉంటుందన్న కామెంట్స్ మూడు పార్టీల నుంచి వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే తనకు మంత్రి పదవి దక్కలేదని, అందుకు ఎవరైనా కమ్మనైన నేత అడ్డుపడ్డారా అన్న ప్రశ్నలు ఇప్పుడు ఉపందుకున్నాయి. మరొవైపు వైసీపీపై కూడా విమర్శలు చేసిన ఆదినారాయణరెడ్డి ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమక్షంలోనే ఈ కుల వ్యాఖ్యలు చేయడంతో ఇబ్బందిగా మారింది.
నియోజకవర్గం వరకు ఇబ్బందులు ఎవైనా ఉన్నాయా ? :
జమ్మలమడుగు నియోజకవర్గం వరకు అయితే బిజేపి అంటే టిడిపి... టిడిపి అంటే బిజేపిలానే కలిసి మెలిసి ఉంటాయి. ఇక్కడ ఉన్న టిడిపి కార్యకర్తలు, నాయకులు బిజేపి కార్యకర్తలు, నాయకులుగానే సమావేశాలకు, కార్యక్రమాలు హజరవుతుంటారు. పదవులైనా, పనులైనా అ పార్టీ... ఈ పార్టీ అనే తేడా లేకుండా ఎవరికి దక్కినా రెండు పార్టీలకు దక్కినట్లే. దీన్ని బట్టి చూస్తే నియోజకవర్గం వరకు ఆదికి వచ్చిన ఇబ్బందులు ఎవి లేవనే చెప్పాలి. సమస్యంతా అయనకు రావాల్సిన పదవులు, పనుల విషయంలో ఎదురైన ఇబ్బందులే ఇలా మాట్లాడించియా ... లేక ఎవరైనా వెనకుండా మాట్లాడించారా తేలాలంటే వేచిచూడాల్సిందే.