- డిప్యూటి సిఎం పవన్‌ను తప్పదోవ పట్టిస్తున్నారు ....
- అందుకే అయనను కలవాలనుకుంటున్నా..
- మరో వీడియో విడుదల చేసిన హర్ష వీణ

రైల్వేకోడూరు :
రైల్వే కోడురు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు.. హర్ష వీణ మరో వీడియో విడుదల చేశారు. అయితే ఈ వీడియోలో ఉహించని ట్విస్ట్ ఇచ్చారు వీణ. అంతేకాదు పలు ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో పంచుకుంది. తన విషయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేసింది. వ్యక్తిగత అంశాన్ని కావాలనే కొందరు రాజకీయాలు చేస్తున్నారంటూ వీడియోలో చెప్పుకోచ్చింది.
రోజుకో వీడియో.. పూటకో ట్విస్ట్.. ఇలా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కాంట్రవర్సీ కంటిన్యూగా హెడ్‌లైన్స్‌లోకి వస్తోంది. బాధితురాలు హర్ష వీణ వరుసగా.. వీడియోలు, చాటింగ్‌లు విడుదల చేస్తూ.. ఈ ఎపిసోడ్‌లో ఆసక్తికర విషయాలను తెరపైకి తీసుకువస్తున్నారు. అరవ శ్రీధర్‌కు తనతోనే కాదు, మరికొంత మంది అమ్మాయిలతో కూడా సంబంధం ఉందని ఆరోపించిన వీణ.. శ్రీధర్ తనతో అలాగే మరికొంత మంది అమ్మాయిలతో చేసిన చాటింగ్‌లు, కార్ లో రైడింగ్ ఇలా పలు వీడియో బాంబులను పేల్చింది. ఇలాగే మాట్లాడితే తన దగ్గర వెయ్యికి పైగా వీడియో స్క్రీన్ రికార్డ్స్ ఉన్నాయంటూ అరవ శ్రీధర్‌కు వార్నింగ్ కూడా ఇచ్చింది.
ఈ క్రమంలోనే.. హర్ష వీణ మరో వీడియో విడుదల చేసి.. ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన విషయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను రైల్వేకోడూరు జనసేన ఇన్ చార్జి తాతంశెట్టి నాగేంద్ర, మరికొందరు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేసింది. తానే ఎప్పుడు మాట్లాడినా తాతంశెట్టి బదులు ఇస్తున్నారని, వ్యక్తిగత అంశాన్ని కావాలనే కొందరు రాజకీయాలు చేస్తున్నారంటూ వీడియోలో చెప్పింది. అవకాశం ఇస్తే ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కలిసి ఆధారాలు ఇస్తానని హర్ష వీణ వీడియోలో అన్నారు. తనది తప్పని తేలితే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు హర్షవీణ. తన తప్పులేదు కాబట్టే పోరాటం చేస్తున్నానని చెప్పుకొచ్చింది. కానీ ఈ ఎపిసోడ్ లో డిప్యూటి సిఎం పవన్ నేరుగా కలవాలని చెప్పడంతో కొత్త ట్విస్ట్ ఇచ్చింది.