కడప :
కడప నగరంలోని కంది పాలెంలో మాజీ సైనిక దళిత కుటుంబాల ఇళ్లను కూల్చివేత ఘటనను సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత, డిజిపిల దృష్టికి తీసుకెళ్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. ఆదివారం ఇంటి కూల్చివేత ఘటనా స్థలంలో బుల్లోజర్లతో నేలమట్టమైన ఇంట్లోని వస్తువులను పరిశీలించి, బాధిత కుటుంబ సభ్యులు ఆదివారం చేపట్టిన రెండవ రోజు రిలే నిరాహార దీక్ష శిబిరంలో మాట్లాడిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య బాధితులకు వెంటనే అన్ని విధాల న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. డిఎస్పీ కార్యాలయానికి సమీపంలోని మాజీ సైనికుల ఇళ్లు కూల్చివేయడం దారుణమని, ప్రోక్లేయిన్లు పెట్టి కూల్చివేస్తూ దాడి చేస్తుంటే పోలీసు యంత్రాంగం నిద్రవస్తలో ఉందన్నారు. పెద్దలు, డేఘల్లాగ వచ్చిన వారి ఇచ్చిన డబ్బులు పోలీసుల రక్షక వాహానాన్ని దారి మల్లించాయని ప్రశ్నించారు. ఓ మాజి సైనికుడి ఇంటిని వంద మంది వచ్చి కూల్చివేస్తే వారిలో ఒక్కరిని అరెస్ట్ చెయ్యలేదని, అరెస్టు చేసిన వారిని కూడా కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఒక మాజీ సైనికుడిని ఇంటికే రక్షణ లేకుండా పోతే ఇక సామాన్యుడికి రక్షణ ఎక్కడుతందన్నారు. అర్ధరాత్రి దళితుల ఇళ్లపై దాడులు చేస్తూ దాడి చేసిన వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటి యాక్ట్ వర్తించాదా అని ప్రశ్నించారు. తక్షణం మాజీ సైనికుడి ఇళ్లను పున: నిర్మించాలని, కూల్చివేసిన ఈ అమానుష ఘటనకు సంబంధించిన అందరిపై హత్యాయత్నం (Attemt murder) కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, ఈ ఘటన తో సంబంధం ఉన్న కడప డిఎస్పీ, వన్ టౌన్ సిఐ లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరగకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. తప్పక ఈ ఘటనను సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత, డిజిపిల దృష్టికి తీసుకెళ్తామని, బాధితులకు న్యాయం, దాడి చేసిన వారికి శిక్ష పడేలా చేస్తామన్నారు.
