* అట్టహాసంగా టీడీపీ కడప పార్లమెంటరీ కమిటీ ప్రమాణస్వీకారం
* జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జబీవుల్లాతో సహా ...
* 41మందితో ప్రమాణస్వీకారం చేయించిన పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి
* వేలాదిమందితో భారీ ర్యాలీ
* భూపేష్ రెడ్డికి పెద్ద ఎత్తున సత్కారం.. అభినందనలు
* పార్టీ పటిష్టతకు కృషి చేస్తా : టీడీపీ జిల్లా నూతన అధ్యక్షుడు భూపేష్ రెడ్డి ...
కడప 07:
కడప జిల్లాలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకొని క్లీన్ స్వీప్ చేస్తామని జిల్లా ఇన్ చార్జి మంత్రి సవిత అన్నారు. ఆ దిశగా ఇప్పటి నుందే పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి క్షమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పేర్కొన్నారు. టీడీపీ కడప పార్లమెంటరీ పార్టీ ప్రమాణస్వీకారం ఈరోజు నగరంలోని అక్కాయపల్లిలోని నూతన పార్టీ కార్యాలయంలో అట్టహాసంగా జరిగింది. జిల్లా అధ్యక్షుడు చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డితో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి జబీవుల్లా సహా 42 మంది ప్రమాణస్వీకారం చేశారు. జీడీపీ మాజీ జిల్లా అధ్యక్షులు, పాలిట్ బ్యూరో సభ్యులు ఆర్, శ్రీనివాసరెడ్డి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. వేలాదిమంది తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య భూపేష్ రెడ్డి అట్టహాసంగా, వైభవంగా జిల్లా నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పవిత మాట్లాడుతూ కలసికట్టుగా పార్టీని ముందుకు నడిపించాలని, ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం భూపేష్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని టీడీపీ నాయకులు, కార్యకర్తల సలహాలు, సహాకారంతో పార్టీ అభివృద్ధికి, పటిష్టతకు తీవ్రంగా కృషి చేస్తానని వెళ్లడించారు. పార్టీలో కష్టపడే నాయకులు, కార్యకర్తలకు నిజమైన గుర్తింపు తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునా యుడు, మంత్రి లోకేష్ సారథ్యంలో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆర్.మాధవీరెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్, పుత్తా కృష్ణచైతన్యరెడ్డి, వరదరాజు లరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు పుత్తా నరసిం హారెడ్డి, బిటెక్ రవి, చదిపిరాళ్ల నారాయణరెడ్డి, బద్వేలు ఇన్ చార్జి రితీష్ రెడ్డి, మైనార్టీ నేత అమీర్ బాబు, గోవర్ధన్రెడ్డి, ముక్తియార్, తదితరులు పాల్గొని ప్రసంగించారు.