Wednesday, 25 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

జోగి రమేష్ కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ పరామర్శ.. పరిస్థితులను స్వయంగా గమనించిన జగన్ .... ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరం - జగన్

06 Feb 2026
07:35 PM
11


విజ‌య‌వాడ‌: 
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో టీడీపీ శ్రేణుల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి, జరిగిన ఘటనపై వివరాలు తెలుసుకున్నారు.
దాడిలో ధ్వంసమైన ఇంటి భాగాలను పరిశీలించిన జగన్, అక్కడి పరిస్థితులను స్వయంగా గమనించారు. అనంతరం జోగి రమేష్ కుటుంబ సభ్యులను కలసి పరామర్శించారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, పార్టీ తరఫున పూర్తిస్థాయి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరమని జగన్ పేర్కొన్నట్లు పార్టీ నేతలు తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. జగన్ పర్యటన సందర్భంగా భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు మద్దతు తెలిపారు.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!