AP: ఆలయ ప్రసాదాలపై సీఎం చంద్రబాబు ?మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. ఐదేళ్లుగా ఆలయాల్లో కల్తీ నెయ్యితో ప్రసాదాలు పంపిణీ చేశారని, శ్రీశైలం ప్రసాదంలోనూ కల్తీ జరిగిందన్నారు. తిరుమల లడ్డూలో బాత్రూమ్లు శుభ్రం చేసే రసాయనాలు వాడారని, ఈ విషయాలన్నీ NDDB నివేదిక ఆధారంగా చెబుతున్నానని చెప్పారు. సీబీఐ, సిట్లు క్లీన్ చిట్ ఇచ్చినట్లు మాట్లాడుతున్నారని, అయితే కల్తీ జరిగినట్లు సిట్ రిపోర్టులో ఉందని వైవీ సుబ్బారెడ్డే చెప్పారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. శ్రీశైలంలో కూడా రసాయనాలతో ప్రసాదం కల్తీ చేశారు. నేను సీఎం అయ్యాక ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించాం. తితిదే ఈవోను మార్చి మంచి ఆఫీసర్ను తీసుకొచ్చాం. గతంతో పోలిస్తే లడ్డూలో చాలా వ్యత్యాసం ఉంది” అని చంద్రబాబు అన్నారు.