ఢిల్లీ :
బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు మార్చింది.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరికొంత సమయం కావాలని స్పీకర్ తరఫు న్యాయవాది కోర్టును కోరగా, సుప్రీం కోర్టు మూడు వారాల గడువు మంజూరు చేసింది.
అయితే ఇచ్చిన గడువులోగా వ్యవహారం పూర్తి చేయకపోతే స్పీకర్‌పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.