Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / అంతర్జాతీయ వార్తలు

టూరిస్గ్ లు ‘ రాకండి ప్లీజ్‌’ ... !

06 Feb 2026
01:13 PM
18


యూరప్‌లో ట్రావెల్‌ ఓవర్‌ క్రౌడింగ్‌ సమస్య ....
వీకెండ్ వస్తే వాలిపోతున్న పర్యాటకులు....

యూరప్  : 

ప్రపంచంలో చలా దేశాలు తమ పర్యాటక రంగంపై ప్రకటనలిస్తూ మరి పర్యాటకులను ఆకర్షించే పనిలో ఉంటే ... యూరప్ దేశాలు మాత్రం దయచేసి పర్యాటకులు మా దేశానికి రాకండని వేడుకుంటున్నాయి.  ఇందుకు ప్రధాన కారణంగా ట్రావెల్ ఓవర్ క్రౌడింగ్.  ఈ సీజన్ లో ఎక్కువ మంది పర్యాటకులు వస్తుండటంతో అటు ప్రభుత్వాలకు, స్థానికులకు ‘ట్రావెల్‌ ఓవర్‌ క్రౌడింగ్‌’ సమస్యలు వచ్చి పడుతున్నాయి. అందుకే, యూరప్‌లో ట్రావెల్‌పై పలు ఆంక్షలు మొదలయ్యాయి.  వాస్తవానికి ప్రపంచ పర్యాటక రంగంలో యూరప్ దేశాల పర్యాటకం రంగానిది కీలక పాత్ర. శతాబ్దాల చరిత్ర, విభిన్న సంస్కృతులు, అద్భుతమైన కట్టడాలు, అందమైన బీచ్లు, ప్రాచీన-ఆధునిక జీవనశైలి కలగలిసిన యూరప్.. పర్యాటకులకు ఎంతగానో ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఫ్రాన్స్లోని పారిస్, ఇటలీలోని వెనీస్, యూకేలోని లండన్, స్పెయిన్లోని బార్సిలోనా, నెదర్లాండ్స్ ని ఆమ్స్టర్దామ్, హంగేరీలోని బుడపెస్ట్, ఆస్ట్రియాలోని వియాన్నా, ఇటలీలోని రోమ్ ఇలా అనేక ప్రాంతాలు టూరిజానికి కేరాఫ్ అడ్రెస్ గా ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ విహారయాత్ర చేయాలనుకునే పర్యాటకులు ముందుగా యూరప్ ను ఎంచుకుంటున్నారు. గతేడాది 70కోట్లకుపైగా పర్యాటకులు యూరప్ పర్యటనకు వెళ్లారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
 Article Image
వీకెండ్ వస్తే వాలిపోతున్న పర్యాటకులు : 
అంతర్జాతీయ పర్యాటకులతో మాత్రమే సమస్య కాదు.. యూరప్ దేశాల ప్రజల నుంచి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఖండంలో దేశాల మధ్య దూరాలు చాలా తక్కువ. బస్సు, రైలు, విమాన మార్గాల్లో తక్కువ ఖర్చుతోనే ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లొచ్చు. దీంతో అక్కడి ప్రజలు వీకెండ్ వస్తే చాలు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో వాలిపోతున్నారు.  యూరప్ దేశాల్లో పారిస్, రోమ్, వెనిస్, లండన్, బార్సిలోనా, ఆమ్స్టర్మ్ వంటి నగరాలు పర్యాటకానికి పెట్టింది పేరు. దీంతో పర్యాటకులంతా నేరుగా ఈ నగరాలకే చేరుకుంటుండటంతో ఎయిర్పోర్టులు నిత్యం పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి.  దీనికి మరో ప్రధాన కారణం సోషియల్ మీడియాలో యూరప్ ప్రముఖ పర్యాటక ప్రాంతాల గురించి  విస్తారంగా ప్రచారం జరుగుతోంది. 'డ్రీమ్ డెస్టినేషన్', 'బకెట్ లిస్ట్' అంటూ ఫొటోలు, వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆ ప్రదేశాలకు వెళ్లడానికి పర్యాటకులు మొగ్గుచూపుతున్నారు.  

ప్రధాన పర్యాటక ఆకర్షణలు  :
పారిస్, ఫ్రాన్స్ : ఈఫిల్ టవర్, లూవర్ మ్యూజియం, సీన్ నది క్రూయిజ్.
రోమ్, ఇటలీ : కొలిసియం, పురాతన శిధిలాలు.
స్విట్జర్లాండ్ : జ్యూరిచ్ & లూసర్న్ వద్ద మంచుతో కప్పబడిన ఆల్ప్స్ పర్వతాలు.
లండన్, ఇంగ్లాండ్ : బిగ్ బెన్, రాజభవనాలు.
ఆమ్‌స్టర్‌డామ్, నెదర్లాండ్స్ : కాలువలు, ట్యూలిప్ పూల తోటలు.
సాంటోరిని, గ్రీస్  : అందమైన సముద్రతీరాలు, అద్భుతమైన సూర్యాస్తమయాలు. 

Article Image


 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!