చండీగఢ్ :
పంజాబ్ లో దారుణం చోటుచేసుకుంది. నడి రోడ్డుపైనే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు లక్కీ ఒబెరాయ్ దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం జలంధర్లోని మోడల్ టౌన్లోని గురుద్వారా వెలుపల గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఉదయం జరిగిందని జలంధరక్కు చెందిన సీనియర్ పోలీసు అధికారి ఫోన్లో తెలిపారు. ఒబెరాయ్ తన కారులో గురుద్వారా వద్దకు వచ్చినప్పుడు, ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. అతన్ని జలంధర్లోని ఆసుపత్రికి తరలించారు, కానీ గాయాల కారణంగా మరణించారని జలంధర్ ఎసిపి పర్మీందర్ సింగ్ చెప్పారు. దాడి చేసిన దుండగులు వాహనంపై కనీసం ఐదు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారని, ఈ సంఘటన తర్వాత, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని, దుండగులను గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజ్ లను స్కాన్ చేస్తున్నామని పోలీసులు చెప్పారు.