* ఒక్క ప్రాజెక్టు కట్టిన చరిత్ర చంద్రబాబుకు లేదు ....
* అయనకు తెలిసింది రెండే పనులు ...
* ఒకటి శిలాఫలకం వేయడం ... రెండోది ఎవరో పూర్తి చేసిన పనులకు క్రెడిట్ తీసుకోవడం ...
* ఉద్యమకారులమని చెప్పుకునే వారు కూడా సీమ లిప్ట్ వేస్త్ అంటున్నారు....
*మరోమారు వేస్గ్ అంటే చెప్పులు... చీపుర్లు పట్టుకుని కొడతారు ....
* అందరికి నీరిస్తున్నా మా నందికొట్కూరు సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు....
పోతిరెడ్డిపాడు :
ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను నిలిపివేయడం అత్యంత దుర్మార్గమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మండిపడ్డారు. గురువారం వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చలో పోతిరెడ్డిపాడు’ బహిరంగ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
రాయలసీమ ఉద్యమకారులమని చెప్పుకునే కొందరు కూడా గత రెండు మూడు రోజులుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వ్యర్థమని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. మద్దతు ఇవ్వమని కోరితే టీఎంసీ, క్యూసెక్కులు అంటే ఏంటో చెప్పాలని వెటకారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవే చదివి ఉంటే ఇంజినీర్లు అయ్యేవాళ్లని వ్యాఖ్యానించారు. ఇవన్నీ కేవలం రాజకీయ స్వార్థం కోసమే జరుగుతున్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్క పని కూడా పూర్తి చేయలేదని, చంద్రబాబుకు తెలిసింది రెండే పనులని విమర్శించారు. ఒకటి శిలాఫలకం వేయడం, రెండోది ఎవరో పూర్తి చేసిన పనులకు తానే క్రెడిట్ తీసుకోవడం అంటూ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో వేటగాడి కథను ఉదాహరణగా చెబుతూ, ఒక వేటగాడు ఉన్నాడు. భయంకరమైన యుద్ధం చేసి పులిని చంపాడు. ఆ నొప్పులు తట్టుకోలేక మందు కోసమని వెళ్లాడు. ఈలోపు చంద్రబాబు లాంటోడు వచ్చాడు. పులి గోళ్లు, పళ్లు ఎత్తుకెళ్లి.. నేనే చంపాను అంటూ చెప్పుకుని తిరిగాడు. హంద్రీ-నీవా సుజల స్రవంతి(HNSS) పనులు తానే చేశానని చెప్పుకుంటున్నాడు. కానీ, ఆ పనులు ఎన్టీఆర్ కాలం నాడే మొదలయ్యాయి. పూర్తి చేసింది రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి.. చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదు అని బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి అన్నారు. అసలు కష్టపడి పని చేసినవాడు వేరే ఉంటే, చివరికి ఫలితం దక్కించుకునేది చంద్రబాబు లాంటి వారేనని వ్యాఖ్యానించారు. పోతిరెడ్డిపాడు తమ నియోజకవరమైన నందకొట్కూరులోనే ఉందని, ఇది రాయలసీమకు ముఖధ్వారమని... శ్రీశైలం ప్రాజెక్టు కోసం భూములిచ్చామని... కానీ ఇక్కడి నుంచి నీరు అందరికి చేరుతున్నా తమ నియోజకవర్గ నీటి సమస్యలు, శ్రీశైలం నీటి ముంపు బాధితుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు.
లడ్డూ అంశం గురించి ప్రశ్నిస్తే దాడులు చేయిస్తున్నారని, యూరియా కొరతపై మాట్లాడితే దాని వాడకం మంచిది కాదని, క్యాన్సర్ వస్తుందని చెప్పే స్థాయికి దిగజారారని విమర్శించారు. మహిళలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై అడిగితే భృతి తన దగ్గర భద్రంగా ఉందంటూ తప్పించుకుంటున్నారని అన్నారు. పవన్ కల్యాణ్ రెండు మూడు నియోజకవర్గాలకే పరిమితమయ్యారని, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ ప్రజలను నిత్యం మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను నిలిపివేయడం ఘోరమైన తప్పిదమని, చంద్రబాబు అండ్ కో అబద్ధాలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారన్నారు. ఇంతకాలం ఉద్యమకారులమని చెప్పుకునే టిడిపి నేతలు కూడా ఇప్పుడు రాయలసీమ లిప్ట్ స్కీం వేస్ట్ అని అంటున్నారని, ఇంకోసారి వేస్గ్ అని అంటే చెప్పులు, చీపుర్లు పట్టుకుని కొడతామని హెచ్చరించారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు చంద్రబాబు జాగీరు కాదని, మెడలు వంచైనా సరే సాధించుకుంటామన్నారు.