* భవిష్యత్తు తరాలు..మనము బాగుండాలంటే ..
* రాయలసీమ ఎత్తిపోతల కోసం ఉద్యమించాల్సిందే.. సాధించుకోవాల్సిందే ..
* ఒక్క వైఎస్ జగన్ హాయంలోనే రాయలసీమకు 170 టిఎంసీలు విడుదల చెయ్యగలిగాం .....
* ఇప్పుడు మిగిలిన పనులు పూర్తి చెయ్యకపోతే మనకు నీరు రాదు ..
*పోతిరెడ్డిపాడు సభలో కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి
పోతిరెడ్డిపాడు :
రాయలసీమ ప్రతి యేటా కరువుతో అల్లాడుతున్న పరిస్ధితి మనకందరికి తెలిసిందేనని, ఈ పరిస్ధితి గట్టెక్కెలాన్నా... మన భవిష్యత్తు తరాలు...మనము బాగుండాలన్నా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సాధించేకోవడమే పరిష్కారమని, ఇందుకోసం ప్రతి ఒక్కరు పోరాడాల్సిన అవసరం ఉందని కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు పి. రవీంద్రనాథరెడ్డి పిలుపునిచ్చారు. నంధ్యాల జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద ఛలో పోతిరెడ్డిపాడు కార్యక్రమంలో భాగంగా అయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నైజం మనందరికి కూడా బాగా తెలుసునని, ఇప్పటికీ 4 సార్లు సీఎం కావడం జరిగిందని దేవుడు ఇలాంటి వారికి ఎందుకు ఇలాంటి అవకాశం ఇచ్చాడో అర్ధం కావడం లేదన్నారు. చంద్రబాబు ఓ పనికిమాలినోడని, అయనకు పరిపాలన చేతకాదని, ఇన్ని మార్లు అయనకు అవకాశం ఇఛ్చినా ఈ రాష్ట్రానికి మేలు చేసే కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు గాని ఎప్పుడు కూడా చేసిన పాపాన పోలేదన్నారు. స్వాతంత్ర్య వచ్చిన నాటి నుంచి రాష్ర్టంలో ట్రెండ్ షెటర్స్ ముగ్గురేనని, వారిలో వైఎస్ఆర్, ఎన్టీఆర్, వైఎస్ జగన్ లు మాత్రమేనన్నారు. చంద్రబాబు నాయుడు హాయంలో అన్యాయంగా ఆక్రమంగా దారుణంగా తెలంగాణా ప్రభుత్వం కృష్ణా నదిపై ప్రాజెక్టులు కడుతున్నా కూడా వాటిని అడ్డుకునే పని ఎప్పుడు చేయలేదన్నారు. ఓ వైపు శ్రీశైలం నిండుతుండగానే 800 అడుగుల నుంచి కరెంటు ఉత్పత్తి పేరుతో, తెలంగాణా ప్రాజెక్టుల పేరుతో నీరు ఎప్పటికప్పుడు నీటిని తొడేస్తుంటే రాయలసీమకు నీరు వచ్చే పరిస్ధితి లేకుండాపోతుందన్నారు. ఈ నీటిని అడ్డుకునే ప్రయత్నం చంద్రబాబు చెయ్యలేదని, గతంలో కర్ణాటక అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల ఎత్తు పెంచినా అడ్డుకోలేకపోయారన్నారు. అలా తోడేసుకుంటే పోతే శ్రీశైలంలో మనకు మిగిలేది 22 టిఎంసీలు కూడా ఉండవన్నారు. ఈ నీటి కోసం వైసీపీ వాళ్లు పోరాడుతున్నారని టిడిపి వాళ్లు విమర్శిస్తున్నారని, కానీ తమ పోరాటం దాని కోసం కాదన్నారు. మనం కూడా 800 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే నీటిని తీసుకుంటేనే మనకు నీళ్లు వస్తాయే తప్పా లేకపోతే మనం ఏడారి కాకతప్పదన్నారు. చంద్రబాబు హాయంలో రాలయసీమకు 22 టిఎంసీలు, 30 టిఎంసీలు విడుదల చెయ్యడం తప్పా ... ఒక్క వైఎస్ జగన్ హాయంలో మాత్రమే 170 టిఎంసీలు విడుదల చెయ్యగలిగిన ఘనత దక్కిందన్నారు. కాబట్టి ఇప్పుడు నిలిచిపోయిన పనులు పూర్తి అయితేనే మనకు నీళ్ళు వస్తాయన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనే లక్ష్యంగా కడపలోను త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, పోతిరెడ్డిపాడుకు వచ్చిన ప్రతి ఒక్కరు హజరై తమ మద్దతు తెలిపాలన్నారు. కడపలో రాబోయే కాలంలో రేపు ఇది ఇటువంటి పెద్ద మీటింగు జరగబోతుంది కచ్చితంగా మీరందరూ కూడా రావలసిందిగా కోరుతున్నాం మహాసభ జరగబోతుంది మీరందరూ కూడా సభకు కూటమి ప్రభుత్వం కుప్పకూలే విధంగా తరలిరావాలన్నారు.
