Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / రాజకీయం

జనసేనకు బ్యాడ్ టైం ... అధినేతలో అసహానం ... !

04 Feb 2026
06:16 PM
141


జనసేనకు బ్యాడ్ టైం ... అధినేతలో అసహానం ...
-ఓ వైపు రైల్వేకోడూరు ఎమ్మెల్యే వ్యవహారం ...
-రాష్ర్టంలో టిడిపి దాడులపై అధికార ప్రతినిధి రజినీ వ్యాఖ్యలు ... సస్పెన్షన్ ...
-అవి మరువకముందే ..సీనియర్ నేత బొల్లిశెట్టి సత్యనారాయణ పదవులకు దూరం ..
-జనసేన అధినేతను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వరుస ఘటనలు ...
-వరుస ఘటనలతో అధినేతలో అసహానం ...

జనసేన పొలిటికల్  : 
జనసేనకు ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తున్నట్లుంది. ఇంత కాలం మా పార్టీలో ఎలాంటి లుకలుకలు లేవు.  విభేధాలు లేవు. మేమందరం మంచివారిమే అనుకున్నారు. కానీ ఇప్పుడు జనసేనకు బ్యాడ్ టైం వచ్చింది. కూటమి విధానాలను వ్యతిరేకించే వారు తెరపైకి వచ్చారు. మహిళలను లైంగికంగా వేధించే వారు వెలుగుచూశారు. ఈ వ్యవహరాలన్ని వెరసి పార్టీ అధినేత జనసేనకు అసహానం తెప్పించాయి. పార్టీ సమావేశాల నుంచి ఉన్న ఫలంగా పలయానం చిత్తగించేసే వారకు పరిస్ధితి వచ్చిందంటే జనసేన ఏం జరుగుతందొ తెలుసుకోవచ్చు. 

Article Image

 

జనసేన పార్టీలో ప్రధానంగా ఇటీవల కాలంలో రైల్వేకోడూరు అరవ శ్రీథర్ రాసలీల వ్యవహారం వివాదాస్పదం కావడం చర్చనీయాంశంగా మారింది. గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నామని, తనను శారీరకంగా అనుభవించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ మహిళా ఉద్యోగి తాను ఫిర్యాదు చేసినా... అరవ శ్రీథర్ జనసేన ఎమ్మెల్యే కావడం వల్ల కేసు నమోదు చెయ్యడం లేదంటూ ఆరోపించింది. ఈ వ్యవహారం అటు ఇటు చిలికి చిలికి గాలి వానలా మారి చివరకు అతన వ్యవహారంలో విచారణకు త్రిసభ్య కమిటి చేసింది పార్టీ. అయితే ఇంతలోనే ఈ వ్యవహారం ఇంటి బయట రచ్చ అయ్యేందుకు సొంత పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతే కావడంతో పార్టీ పరువు కాస్తా మంటగలిసినట్లయ్యింది. త్రిసభ్య కమిటి ముందు విచారణకు హజరైన ఎమ్మెల్యే అరవ శ్రీథర్ కూడా తాను చెప్పాలనుకుంది కమిటి ముందు చెప్పానని, పార్టీ అధినేత నిర్ణయం తరువాతే తాను మళ్లీ జనాల్లోకి వస్తానని చెప్పారు. కానీ ఈ వ్యవహారం ప్రతిపక్ష పార్టీ చేసిన రచ్చతో జనసేన తలెత్తుకోలేని స్ధితిలోకి నెట్టివేసింది. 

Article Image

 

 

ఈ వ్యవహారం రాష్ర్టంలో సంచలనంగా మారగా... గత కొంత కాలంగా జరుగుతున్న తిరుమల లడ్డూ వ్యవహారం... సిబిఐ, సిట్ నివేదికల అనంతరం ప్రతిపక్షం మాటలు పెంచడం... కూటమిలోని తెలుగుదేశం పార్టీ సహించలేకపోయింది. వైసీపీకి చెందిన మాజీ మంత్రులు విమర్శించారని ఏకంగా మాజీ మంత్రులని చూడకుండా కార్యకర్తలు మొదలు నేతలు కూడా బండబూతులు తిడుతూ దాడులకు తెగబడ్డారు. ఇళ్లపై రాళ్లు, పెట్రోలు బాంబులు వేసి దహానం చేశారు. ఇళ్లలో వస్తువులు పగలగొట్టేశారు. ఈ దాడులపై మళ్లీ వైసీపీ వాయిస్ పెంచేసింది. దీంతో రాష్ర్టంలో వైసీపీ, టిడిపి మధ్య ఇంత పెద్ద ఎత్తున వాదోపవాదాలు, గొడవలు, దాడులు చోటుచేసుకుంటున్న జనసేన మాత్రం నోరు మెదపలేదు. దీంతో ఓ వైపు మీడియా, టిడిపిలోని కొందరు జనసేన ఎందుకు మౌనంగా ఉందన్న ప్రశ్నలు హోరెత్తాయి. ఇంతలో జనసేన అధికార ప్రతినిధి రజినీ ఓ టివి డిబేట్ లో కూర్చుని .... మీరు ఇలా మాజీ మంత్రులు, కార్యకర్తలకు రోడ్లపై దాడులు చెయ్యడం.... వారి ఇళ్లపై దాడులు చేస్తే ... రేపు వారు అధికారంలోకి వచ్చాకా ఉరికే ఉంటారా ? ... వారు 
రోడ్లపై నరుక్కుంటూ పోతారని, ఇలాంటి దాడులు సరైంది కాదంటై వ్యాఖ్యనించడంతో టివి ఛానల్ డిబెట్ లో ఉన్న వారు కాదు...జనసేన నేతలు సైతం నోరెళ్లబెట్టారు. దీంతో అమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు దారితీసింది. 

Article Image

 

ఈ వ్యవహారంతో పార్టీ పెద్దలకు తలబొప్పి కట్టిస్తే .... సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ పదవుల నుంచి  తప్పుకుంటున్నట్లు ప్రకటించడం విచిత్ర పరిస్ధితి ఏర్పడేలా చేసింది. ఈయన ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం  ఉత్తరాంధ్ర కాలుష్యం. ఈ కాలుష్య సమస్యలపై హైకోర్టులో అయన పిల్ దాఖలు చేశారు. ఇందులో ఏపీ పర్యావరణశాఖను ప్రతివాదిగా కూడా చేర్చారు.. అయితే ఈ శాఖకు పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉండటం ప్రధాన్యతను సంతరించుకుంది. హైకోర్టులో దాఖలైన పిల్ విషయంలో తుది తీర్పు వచ్చే వరకు పార్టీ బాధ్యతలకు దూరంగా ఉంటానని ప్రకటించి పదవుల నుంచి తప్పుకున్నారు. ప్రభుత్వానికి, పవన్ కల్యాణ్‌కు చెడ్డ పేరు రాకూడదని ఆయన పార్టీ పదవుల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించినా సీనియర్ నేత ప్రభుత్వంలో కీలకంగానే వ్యవహరిస్తున్న నేత హరిప్రసాద్ ... ప్రభుత్వ స్థాయిలో ఎదైనా సమస్యగా మారకుండా చక్కదిద్దాల్సిన స్ధితిలో ఉండి కూడా పదవులకు దూరం కావడం అన్నది చర్చనీయాంశంగా మారింది. 

Article Image

 

 

అంతేకాదు ఈ అసహానం వల్లే తన సొంత అన్న ఎమ్మెల్సీ నాగబాబు సైతం మౌనంగా ఉండటాన్ని జనసేన అధినేత పవన్ సహించలేకపోయారు. పదవులు తీసుకుని ఇలా మౌనంగా ఉండటమేంటని బాహటంగానే తప్పపట్టారు. తప్పనిసరి పరిస్ధితుల్లో నాగబాబు కూడా మీడియా ముందుకు వచ్చి తిరుమల లడ్డు విషయమై టిడిపికి మద్దతుగా మాట్లాడాల్సి వచ్చింది. 

మొత్తం మీద జనసేనలో చోటుచేసుకుంటున్న పరిణామాలు అధినేత పవన్ కు సహానం కోల్పోయేలా చేస్తున్నాయి. దీంతో అయన సహనం కోల్పోయి అసహనంగా సమావేశాల నుంచి అకస్మికంగా ఆగ్రహంగా బయటకు వెళ్లిపోతున్న పరిణామాలు ఎదురయ్యాయి. ఇలాంటి పరిణామాలు రానున్న రోజుల్లో మరెన్ని చూడాలోనన్న చర్చ ఇప్పుడు ఎపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.  

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!