Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

ఎపిలో ప్రజాస్వామ్యం లేదు ...! * ఏపీలో ఉన్న పరిస్థితిలు ఏ రాష్ట్రంలో లేవు... తక్షణం రాష్ర్టపతి పాలన విధించాలి ....వైసీపీ కడప జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథరెడ్డి

04 Feb 2026
03:09 PM
250

Article Image

 

కడప   : రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని,  ఏపీలో ఉన్న పరిస్థితిలు ఏ రాష్ట్రంలో లేవని ఘాట్ వ్యాఖ్యలు చేశారు వైసీపీ కడప జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథరెడ్డి. ఈ కూటమి పాలనలో లోపాలను ఎవరు ప్రశ్నిస్తే వారిపై దాడులకు పాల్పడుతూ రాష్ట్రంలో కొత్త సాంస్కృతిని  తీసుకొచ్చిందన్నారు. రాష్ర్టంలో గతంలో అంబేద్కర్ రాజ్యాంగంలో పాలన సాగిందని,  ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగంలో  దుర్మార్గమైన పాలన సాగుతుందన్నారు. కార్యకర్తలనే కాదు ఏకంగా మాజీ మంత్రులపై దాడులకు తెగబడుతున్నారని, గత ప్రభుత్వంలో ఏమి చేయకపోయినా జగన్ రాజ్యాంగం.... రాజారెడ్డి రాజ్యాంగం అంటూ విమర్శించారు. తిరుమల లడ్డులో కల్తీ లేదని సిబిఐ, సిట్ నివేదక ఇచ్చినా కూటమి నేతలు విమర్శలు అపడం లేదని, వారి విమర్శల వల్ల భక్తులందరూ బాధపడుతున్నారన్నారు. ప్రసాదాన్ని కల్తీ చేయాలని ఎవరికి ఉండదని, అయితే సిట్, సిబిఐ విచారణలతో తిమ్మిని  బొమ్మ చేయాలని చూశారన్నారు. కానీ రెండు లడ్డులో కల్తీ జరగడలేదని చెప్పడంతో కూటమికి అనుకున్న విధంగా సిట్, సిబిఐ రిపోర్టు రాలేదనే ఆక్రోశంనే ఇప్పుడు దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఆ అక్రోశంతోనే మాజీ మంత్రులు అంబటి, జోగి రమేష్ ఇళ్లపై దాడులకు తెగబడ్డారని, విడుదల రజిని, బొళ్ల బ్రహ్మనాయుడు ఇతర నేతలపై దాడులు చేశారన్నారు. అయితే అంత పెద్ద ఎత్తున దాడులకు పాలుపడితే కఠినంగా శిక్షించాల్సింది పోయి దాడులకు పాల్పడిన వారిని స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారని విమర్శించారు.  రాష్ర్టంలో శాంతి భద్రతలు అదుపులో ఉండాలంటే తప్పక రాష్ట్రపతి పాలన విధించాలని అయన డిమాండ్ చేశారు. 

 

 


 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!