Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

వైసీపీ "ఛలో పోతిరెడ్డిపాడు"కు ... ప్రభుత్వ అంక్షలు ... !

04 Feb 2026
02:31 PM
132

 
వైసీపీ "ఛలో పోతిరెడ్డిపాడు"కు ...   ప్రభుత్వ అంక్షలు ... 
-సౌండ్ సిస్టం నిషేదం ... ర్యాలీకి అనుమతి నిరాకరణ ...
- NH-340 పై ట్రాఫిక్ ఇబ్బందులు కలగరాదు ....
-రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ప్రసంగాలు చేయరాదు....
- ప్రజా జీవనానికి అంతరాయం కలిగించరాదు
- పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వైపు వెళ్లరాదు .....
-సీమ ద్రోహిగా చంద్రబాబుపై విమర్శలు చేస్తారన్న ముందస్తూ జాగ్రత్తా ?

Article Image

 


పోతిరెడ్డిపాడు  :

రాయలసీమ నీటి హక్కుల కోసం వైఎస్సార్‌సీపీ ఈనెల 5న తలపెట్టిన "చలో పోతిరెడ్డిపాడు" కార్యక్రమానికి ప్రభుత్వం తీవ్ర అంక్షలు విధించింది. ఇప్పటికే ప్రతిపక్ష వైసీపీతో పాటు సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని రైతు, ప్రజా సంఘాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తుండగా... ఈ కార్యక్రమం ద్వారా మరింత తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున అంక్షలు విధించింది. ఈ అంక్షలు చూసిన ఎవ్వరికైనా ప్రతిపక్షాన్ని నిబంధనలు పేరుతో కట్టడి చెయ్యడమే లక్ష్యమన్న రీతిలో ప్రభుత్వ వ్యూహంగా కనపడుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఇప్పటికే ఈ కార్యక్రమానికి ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమకు నీటి విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ, రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనే లక్ష్యంగా  ఈ ఆందోళన చేపడుతున్నారు. దీనికి సంబంధించి అన్ని ప్రాంతాల్లో పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించి రాయలసీమ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చెయించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ముందుకెళ్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నంధ్యాల జిల్లా వైసీపీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుమతి కోరారు. ఇందుకు ప్రభుత్వం పోతిరెడ్డిపాడు గ్రామం మాజీ సర్పంచ్  .గోపాల్ రెడ్డి  పొలంలో బహిరంగా సభ నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది.   అనుమతి ఇస్తూనే "దిగువ సూచించిన అంశాల ప్రకారంగా నిర్వహించుకోవాలంటూ" తీవ్ర అంక్షలు విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  ఈ కార్యక్రమానికి  ప్రభుత్వం విధించిన అంక్షలు ఒక సారి చూస్తే .....


1) మీరు శాంతిభద్రలకు ఎటువంటి విఘాతం కలిగించకుండా 05.02.2026 వ తేదిన గురువారం రోజున ఉదయం 10.00 గంటల నుండి మధ్యహ్నం 2.00 గంటల వరకు పోతిరెడ్డిపాడు గ్రామంలోని మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి పొలంలో బహిరంగ సభ ఏర్పాటు చేసుకొనవచ్చును.
2) ఎటువంటి ర్యాలీని మోటార్ సైకిల్ ద్వారా కానీ, ఇతర వాహనముల ద్వారా ర్యాలీకి అనుమతి లేదు.
3) DJ వంటి సౌండ్ సిస్టంను ర్యాలీని లో అనుమతి లేదు .
4) మీరు ట్రాఫిక్ కు NH 340C కర్నూలు నుండి ఆత్మకూరు రోడ్డులో ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. 
5) మీ యొక్క బహిరంగ సభలో ఏ వ్యక్తులను కానీ, ప్రభుత్వం పైన కానీ మరియు మరెవరిపైన వ్యక్తిగతంగా కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ప్రసంగాలు చేయరాదు.
6) బహిరంగ సభలో కానీ ఎక్కడా కూడా బాణసంచాలు మరియు టపాకాయలు కాల్చడానికి అనుమతి లేదు. 
7) అత్యవసర సర్వీసులకు మరియు ప్రజా జీవనానికి అంతరాయం కలిగించరాదు.
8) మీరు ఏర్పాటు చేసుకున్న పోతిరెడ్డిపాడు గ్రామ సభ ప్రాంగణం నుండి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సుమారు 3 K.M కలదు . కావున మీరు ఈ యొక్క సభ ప్రాంగణం నుండి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వైపు వెళ్ళడానికి అనుమతి లేదు.
9) మీ సమయ పాలనలో ఎటువంటి మార్పు చేయరాదు.


* సీమ ద్రోహిగా చంద్రబాబుపై విమర్శలు చేస్తారన్న ముందస్తూ జాగ్రత్త : 
ఇందులో భాగంగా ప్రభుత్వంపై ప్రత్యేకించి సిఎం చంద్రబాబు మొదటి నుంచి సీమకు అన్యాయం చేస్తున్నారంటూ ఇప్పటికే విమర్శలు గుప్పిస్తుండగా, ఈ కార్యక్రమంలో మరింతగా చంద్రబాబుపై దుమ్మెత్తిపోసే అవకాశం ఉండటంతో " బహిరంగ సభలో ఏ వ్యక్తులను కానీ, ప్రభుత్వం పైన కానీ  మరెవరిపైన వ్యక్తిగతంగా " కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రసంగాలు చేయరాదంటూ ఆంక్షలు విధించింది. దీన్ని బట్టి చూస్తే సిఎం చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ ఎవ్వరు విమర్శలు చెయ్యరాదు.... కేవలం రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధించుకుందాం అన్న నినాదాలు మాత్రమే వినపడాలన్నట్లుగా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా ఈ అంశాన్ని అంక్షల్లో పొందుపరచినట్లుగా కనపడుతొంది. 

* " పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ " వైపు వెళ్లేందుకు సైతం అనుమతి నిరాకణ : 
మరో ప్రధాన అంశం.... ఈ సభకు వెళ్లే నాయకులు, రైతులు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను సందర్శించడం సర్వసాధారణంగా జరిగే కార్యక్రమం. కానీ ప్రభుత్వం మాత్రం " పోతిరెడ్డిపాడు గ్రామ సభ ప్రాంగణం నుండి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ " వైపు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది.  కానీ వచ్చిన వారు అటు వైపుగా వెళ్లక మానరు.... వచ్చిన వారిపై కేసులు బణాయించవచ్చు అన్న ఉద్దేశ్యంగా కూడా ప్రభుత్వం ఈ అంక్షలను పెట్టి ఉండవచ్చునన్నది అరోపణగా కనపడుతొంది. 

* NH 340Cరోడ్డులో ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి : 
వైసీపీ తలపెట్టిన ఛలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి వెళ్లాలంటే దాదాపుగా అన్ని జిల్లాల వారు ఈ రహదారి గుండానే వెళ్లాల్సి ఉంటుంది. ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన వారందరు కర్నూలు నుండి ఆత్మకూరు మధ్యలో ఉండే రహదారి మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు ఉమ్మడి కర్నూలు జిల్లా వారు సైతం ఈ రహదారి గుండానే వెళ్లాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఈ రహదారిపై ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా చూడాలంటూ అంక్షలు విధించడాన్ని చూస్తే ఇది ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించారని వైసీపీ వారిపై కేసులు పెట్టే కార్యక్రమం తప్ప మరొకటి కాదంటూ ఆరోపిస్తున్నారు. 

*  వాహనాల ర్యాలీకి అనుమతి లేదు :
ఏ  జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు, రైతులు ఒకే సారిగా వాహనాల ర్యాలీగా రావడం సర్వసాధారణంగా జరిగే కార్యక్రమం. కానీ ప్రభుత్వం మాత్రం వాహనాల ర్యాలీకి అనుమతి లేదంటూ మెలిక పెట్టింది. అంతిమంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనం కోసం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు  ప్రతిపక్ష పార్టీ ఛలో పోతిరెడ్డిపాడు నిర్వహిస్తుంటే ప్రభుత్వంపై విమర్శలు చేస్తారన్న అనుమానంతోనే ఈ అంక్షలు విధించారన్న అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

Article Image
 

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!