కడప :
కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చి ... అధికారంలోకి వచ్చాకా కాపులపైనే దాడులకు తెగబడతారా అంటూ ప్రశ్నించారు గండి ఆలయ కమిటి మాజీ ఛైర్మన్ కృష్ణతేజ. కడపలో మీడియాతో మాట్లాడిన అయన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి చేసింది కాకా టిడిపి నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాపు నాయకులను విమర్శిస్తే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చరిత్ర చూసుకుని మాట్లాడాలని,
వంగవీటి రంగ హత్య అనంతరం పరిణామాలు ఎలా ఉన్నాయో అందరికి తెలిసిందనన్నారు. కాపు నేత ముద్రగడ పద్మనాభంపై దాడి చెయ్యడం ఎలాంటి పరిణామాలో ఎదురయ్యాయో తెలుసుకోవాలన్నారు. తిరుమల లడ్డుపై దుష్పచారాన్ని ప్రశ్నిస్తే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యయత్నానికి పాల్పడటమే కాకుండా అయన ఇంటిపై దాడికి దిగడం హేయమైన చర్యన్నారు. చంద్రబాబుపై అయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్లు చెప్పినా దాడులుకు పాల్పడటం గర్హనీయమన్నారు. గతంలో మీరు వైఎస్ జగన్ తిట్టలేదా అప్పుడు చట్టాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. అంబటి ఇంటిపై దాడి సందర్బంగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నా చట్టాలు ఎందుకు పట్టించుకోలేదన్నారు. హక్కలు ఉండేది కేవలం చంద్రబాబుకేనా, ఎమ్మెల్యేలకు, అంబటి రాంబాబుకు ఉండవా అని ప్రశ్నించారు. 2024 కేవలం మద్దతుతోనే ప్రభుత్వ ఏర్పాటు చేశామని చెప్పి అధికారంలోకి వచ్చాకా మాపైనే దాడులు చేస్తున్నారని, కాపుల ప్రతినిధిగా నేనన్నాను అని చెప్పే డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ కాపులపై జరుగుతున్న దాడుల గురించి ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కాపులపై జరుగుతున్న దాడులు అయనకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ముద్రగడ, అంబటి రాంబాబుపై జరుగుతున్న దాడులను సమర్ధిస్తున్నారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దాడులు ఇలాగే జరిగితే కాపుల ఆగ్రహావేశాలను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.