* బాధితురాలు వీణను రచ్చ చేసేలా ఉసిగొల్పిన స్థానిక కూటమి నేత ...
* 25 కోట్ల డిమాండ్ వెనక ఆ నేత ప్రమేయం ....
* వ్యవహారం రోడ్డున్న పడ్డాకా ... ఆ జనసేన నేత ఓ బ్రోకర్ అంటూ తీవ్రంగా దుయ్యబట్టిన ఉద్యోగి వీణ ...
* ఎమ్మెల్యేను తప్పుగా మాట్లాడటంతో ఆ నేతను బ్రోకర్ అంటూ విమర్శలు ....
* రైల్వేకోడూరు ఎమ్మెల్యే ఎపిసోడ్ మొత్తానికి ఆ నేత కారణమన్న ఆరోపణలు ....
రైల్వేకోడూరు :
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్ దుమారం రేపింది. అయితే ఈ ఎపిసోడ్ వెనక స్థానిక జనసేన నేత హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. రచ్చ చెయ్యడం మొదలు.... కథను మొత్తం నడపడం వెనక కథ... డైరెక్షన్ ... అన్ని ఆ నేతవే అన్నట్లు కథ సాగుతుందని చర్చ రైల్వేకోడూరులో కోడై కూస్తొంది. అయితే విషయం తెలుసుకున్న అధిష్టానం ఓ కమిటిని ఏర్పాటు చేసి విచారణ కోసం కోడూరు పంపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలకు వెనక ఏం జరిగిందో ఒఖ సారి చూస్తే ....
ఎమ్మెల్యే శ్రీధర్‌పై ఆరోపణలు చేస్తూ వీణ అనే ఓ మహిళ ఉద్యోగి అత్యాచారం ఆరోపణలు చెయ్యడం ....వీడియోలను విడుదల చేయడం కలకలం రేపాయి. దీనికి ప్రతీగా తన కుమారుడిపై ఆ మహిళ ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీధర్ తల్లి ప్రమీల చెప్పుకొచ్చారు. ఇందుకుతోడు ఆ మహిళ శ్రీధర్‌ను రూ.25 కోట్లు డిమాండ్ చేసిందని.. ఆమె బెదిరింపులకు దిగిన ఆడియోలు, వీడియోలు తమ దగ్గర ఉన్నాయని స్ధానిక జనసేన పార్టీ నేత సైతం చెప్పుకొచ్చారు. అంతేకాకుండా వీణ యూపిఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుండటం వల్ల అమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు, ఇవన్నీ వెలుగులొకి రావడంతో అమె పరారీలో ఉన్నట్లు అయన చెప్పారు.

ఈ విషయమై మరో వీడియో విడుదల చేసిన ఉద్యోగిని వీణ తాను పరారీలో ఉన్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. కొందరికి డబ్బులు ఇచ్చి మరీ తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. "దమ్ముంటే ఆధారాలు బయట పెట్టండి.. అంతే తప్ప లేనిపోని ఆరోపణలు చేయొద్దు" అంటూ ఆమె సవాల్ విసిరుతూ ..... తన పట్ల బ్రోకర్ రాజకీయాలు వద్దంటూ స్థానిక జనసేన నేతపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం జనసేన పార్టీకి నష్టం కలిగించేలా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ నీతిగా జీవించే వ్యక్తి అని, ఇలాంటి బ్రోకర్ రాజకీయాల వల్ల ఆయనకు ఇబ్బందులు కలగడం బాధాకరమని ఆమె వ్యాఖ్యానించారు.
ఇక్కడే కథ ఓ మలుపు తిరిగినట్లయ్యింది. అప్పటి వరకు ఎమ్మెల్యేకు మద్దతుగా మాట్లాడుతున్నట్లు ఆ నేత వ్యవహరించగా... మహిళా ఉద్యోగి రూ.25 కోట్లు డిమాండ్ చేసిందని చెప్పడంతో .... తిరిగి అమె చేసిన విమర్శలు తిరిగి ఆ నేతకే తగిలేలా చేసింది. ఈ వ్యవహారం మొత్తంలో బ్రోకర్ గా వ్యవహరించింది కూడా ఆ నేతనే అన్న సమాచారం బయటకు పొక్కింది. ఈ వ్యవహారం కాస్త ఇంటా బయట జనసేన చుట్టూ విమర్శలు చుట్టుముట్టాయి. ప్రత్యేకించి ప్రతిపక్ష వైసీపీకి ఓ అయుధంలో మారింది. దీంతో ఏం చెయ్యాలో దిక్కుతోచని స్ధితిలో ఉన్న జనసేన ఎట్టకేలకు ఎమ్మెల్యే శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసేందుకు కమిటీని నియమిస్తూ జనసేన పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీ నివేదికను వారంలోగా సమర్పించాలని ఆదేశించారు. ఈ కమిటిలో శివశంకర్, తంబళ్ళపల్లి రమాదేవి, టి.సి.వరుణ్ లు ఉన్నారు.
అయితే ఈ వ్యవహారం మొత్తానికి స్థానిక నేతే కారణమన్న సమాచారం తెలుసుకున్న పార్టీ అదిష్టానం కూడా ఇప్పుడు పూర్తి సమాచారం రాబట్టేందుకే త్రిసభ్య కమిటిని ఏర్పాటు చేసిందని సమాచారం. ఈ విచారణకు ఎమ్మెల్యే అరవ శ్రీథర్ తో పాటు వీణ కూడా హజరయ్యే అవకాశాలున్నాయి. మరి ఈ విచారణలో సూత్రధారిని పట్టుకుంటారా ? లేక పాత్రధారులనే దోషులుగా చేస్తారా అన్నది వేచి చూడాలి.