Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

టిడిపి కార్యకర్తలు సంయమనం కోల్పోతే ఎలా ఉంటుందో వైసీపీ నేతలు చూశారు... - ఇక నైనా టిడిపి కార్యకర్తలను రెచ్చకొట్టద్దు... - కడప జిల్లా టిడిపి నూతన అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి

02 Feb 2026
01:57 PM
324


కడప   : 
మాజీమంత్రి హోదాలో ఉంటూ అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, దాని ఫలితంగానే టిడిపి కార్యకర్తలు సంయమనం కోల్పోతే ఎలా ఉంటుందో వైసీపీ నేతలు చూశారని కడప జిల్లా టిడిపి నూతన అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి జాబివుల్లా అన్నారు.   టిడిపి కార్యకర్తలు సంయమనం కోల్పోతే ఎలా ఉంటుందో చూసైనా వైసీపీ నేతలు  ఇక నుంచైనా టిడిపి కార్యకర్తలను రెచ్చకొట్టద్దన్నారు. కడపలో మీడియాతో మాట్లాడిన అయన  రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి దిశగా దూసుకువెళ్తుందన్నారు. అన్ని జిల్లాల సమగ్రాభివృద్దే లక్ష్యంగా  ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు వెళ్తున్నారన్నారు.  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు అనేకమంది ముందుకు వస్తున్నారన్నారు.  మాజీమంత్రి హోదాలో ఉంటూ అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, మా ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేసినందువల్లే రాష్ర్ట వ్యాప్తంగా టిడిపి కార్యకర్తల్లో ఆగ్రహం తెప్పించిందన్నారు. టిడిపి కార్యకర్తలు సంయమనం కోల్పోతే ఎలా ఉంటుందో చూపించారని, ఇక నుంచైనా వైసీపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని, టిడిపి కార్యకర్తలను రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు పలికారు. అలాకదని టిడిపి కార్యకర్తలను రెచ్చగొడితే  చూస్తూ ఉరుకోరన్నారు. 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!