కడప :
ఎపీలో రాక్షస పాలన సాగుతుందనడంలో పక్కా క్లారిటి వచ్చిందని, ప్రజల్లో ఉన్న అనుమానాలు సైతం నివృత్తి అయ్యాయిని కమలాపురం వైసీపీ ఇన్ చార్జి నరేన్ రామాంజులరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న తిరుమల లడ్డుపై తప్పుడు ప్రచారం, వైయస్సార్సీపి నాయకులపై జరుగుతున్న దాడులు ను ఖండిస్తూ కమలాపురం పోలీసు స్టేషన్ లో వైయస్సార్ సిపి నాయకులతో ఎస్ఐ విధ్యాసాగర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం అయన మాట్లాడుతూ తిరుమల లడ్డు తయారీలో కల్తీ జరిగిందని అసత్య ప్రచారం చేసి సిట్ విచారణకు ఆదేశించారని, వారి అధికారులనే ఇందులో నియమించుకున్నారన్నారు. చంద్రబాబు సిఎం అయ్యాకా నియమించిన తొలి విచారణ కమిటి కూడా ఇదేనన్నారు. టిటిడి ఈఓగా శ్యామలరావు ఉన్న సమయంలో శ్యాంపుల్స్ తీశారని, గడచిన ఐదేళ్లలో ఎన్నడే శ్యాంపుల్స్ తీయలేదన్నారు. ఈ కేసు విషయమై విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టులో కేసు వేయడంతో సిబిఐ విచారణకు ఆదేశించిందన్నారు. దేశంలో అత్యున్నత విచారణ సంస్థ సిబిఐ, రాష్ర్ట ప్రభుత్వం నియమించిన సిట్ రెండు తిరుమల లడ్డూలో కల్తీ లేదని, జంతువుల కొవ్వు కలవలేదని క్లీన్ చీట్ ఇస్తూ నివేదిక ఇచ్చాయన్నారు. కానీ దేశంలో అత్యున్నత విచారణ సంస్థ సిబిఐ ఇచ్చిన నివేదికపైనా చంద్రబాబుకు నమ్మకం లేదని, సిబిఐ, సిట్ నివేదికలలో ఎక్కడా మాజీ సిఎం వైఎస్ జగన్ మోహాన్ రెడ్డి, గత టిటిడి ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిల పేర్లు ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. టిటిడి ఇఓ, డిప్యూటి ఇఓ ల పేర్లు మాత్రం ప్రస్తావించిందన్నారు. కానీ సిబిఐ నివేదికపైన నమ్మకం లేని చంద్రబాబునాయుడు నేను గొప్ప భక్తున్ని అంటునే మరో వైపు కించపరిచేలా మాట్లాడటం తగదన్నారు. సిబిఐ క్లీన్ చీట్ ఇచ్చినా ప్రధాన కూడళ్లలో తిరుమల లడ్డూను కించపరిచేలా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని, అందువల్లే కూడళ్లలో కట్టిన బ్యానర్స్ విషయమై మాజీ మంత్రి అబంటి రాంబాబు ప్రశ్నించారన్నారు. మరుసటి రోజు అయన అదే కూడలికి వెళ్తే అక్కడ టిడిపి నాయకులు, కార్యకర్తలు రాడ్లు, కర్రలు పట్టుకుని దాడికి ప్రయత్నించారన్నారు. ఇదే సందర్బంలో గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఓ మహిళ అయినా మాజీ మంత్రి అంబటిని నోటికొచ్చినట్లు దూషించిందన్నారు. అంతటితో ఆగక అంబటి ఇంటిపై దాడి చెయ్యడం, ఇంటికి నిప్పుపెట్టడం వంటి ఘటనలు జరుగుతున్నా పోలీసులు చూస్తూ ప్రేక్షక పాత్ర పోషించారన్నారు. అంతేకాకుండా మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైనా, విజుదల రజిని, మాజీ ఎమ్మెల్యేలు బొళ్ల బ్రహ్మనాయుడు, భూమన కరుణాకర్ రెడ్డిలపై దాడికి పాల్పడ్డారన్నారు. ఇవన్నీ చంద్రబాబు ప్రొద్బలంతోనే జరిగాయని, అందువల్లే పోలీసులు చూస్తే ఉరికే ఉండిపోయారన్నారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులే చూస్తే ప్రేక్షక పాత్ర పోషించారంటే ఇది ఆటవిక పాలన కాక మరేమిటని ప్రశ్నించారు. తక్షణం దాడికి కారకులైన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చెయ్యాలని, లేనిపక్ష్యంలో పోలీసులపై ప్రజలకు ఉన్న నమ్మకం పోతుందన్నారు. తిరుమల లడ్డూపై విమర్శలు చేసిన చంద్రబాబునాయుడు, లోకేష్, పవన్ లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
