Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు అహం దెబ్బతినే .... రాష్ట్రాన్ని జంగిల్రాజ్ గా మార్చారు.... తక్షణం రాష్ర్టంలో రాష్ట్రపతి పాలన విధించాలి - కడప వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు

02 Feb 2026
11:36 AM
167


కడప      :
తిరుమల లడ్డూలో కల్తీ లేదని తెలడం వల్లే చంద్రబాబు అహం దెబ్బతినిందని, అందువల్లే రాష్ట్రాన్ని జంగిల్రాజ్ మార్చారని కడప వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు లేదని ల్యాబ్లు తేల్చడం, సిట్ నివేదిక ఇవ్వడంతో చంద్రబాబు అహం దెబ్బతిందన్నారు.  అది తట్టుకోలేకనే డైవర్షన్ కోసమే ఈ కుట్రలకు తెర తీశారని, తప్పుడు ప్రచారాలతో ఫ్లెక్సీలు పెట్టి, శాంతి భద్రతల సమస్య సృష్టించాలన్నది చంద్రబాబు ప్రణాళిక అని, ప్రశ్నించే వారిని అంతం చేయాలన్నదే ఆయన పథకమన్నారు. తనకు సాగిలపడే పోలీసు అధికారులకు ముందే చెప్పిన చంద్రబాబు నాలుగు రోజుల్లో నలుగురు కీలక నాయకులపై దాడులు చేయించారన్నారు. మొదటగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి ఇంటిపై టీడీపీ గుండాలు దాడులకు తెగబట్టారని, అనంతరం మాజీ మంత్రి  విడుదల రజని, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడులపై వరుసగా దాడులు జరుగుతున్నా ఎక్కడా పోలీసులు వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. వీటికి సంబంధించి ఒక్క కేసు పెట్టకపోగా, ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదన్నారు. అదే క్రమంలో రెండు, మూడు రోజులుగా అంబటిపై దృష్టి పెట్టిన టీడీపీ గూండాలను చంద్రబాబు వెనుక నుంచి ప్రొత్సహించారని,  దాడుల కుట్రకు కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబేనన్నారు. పోలీసులు ప్రభుత్వానికి సాగిలపడ్డారని, చట్టాన్ని తుంగలో తొక్కారని, రక్షణ కల్పించాల్సిన కనీస బాధ్యతలను విస్మరించారన్నారు. అంబటిపై హత్యాయత్నం, దాడులు పోలీసులే దగ్గరుండి చేయించారని,  ఇలాంటి తరుణంలో ప్రజలకు, రాజకీయ నాయకులకు రక్షణ బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. ఘటనా స్థలానికి కూతవేటు దరంలో గుంటూరు డీఐజీ, ఎస్పీ కార్యాలయాలు ఉన్నాయని, గుంటూరుకు అత్యంత సమీపంలోనే డీజీపీ కార్యాలయం, ప్రత్యేక బలగాలు, ముఖ్యమంత్రి, మంత్రుల నివాసాలు ఉన్నాయన్నారు. వీరి వత్తాసుతోనే హత్యాయత్నం, విధ్వంసం జరిగిందన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ పాలన విఫలమైందని, పరిపాలన యంత్రాంగం కుప్పకూలిపోయిందన్నారు. జంగిల్రాజ్, ఆటవిక పాలన కనిపిస్తున్న తరుణంలో రాష్ట్రపతి పాలన విధించాలన్నారు.   తిరుమల శ్రీవారి ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, గొడ్డుమాంసం కొవ్వు, పంది కొవ్వు కలిసిందంటూ తప్పుడు ప్రచారం చేసి శ్రీవారి భక్తుల మనోభావాలను చంద్రబాబు, పవన్కల్యాణ్, లోకేష్లు గాయపరిచారన్నారు. ఆ శ్యాంపిళ్లలో ఇవేవి లేవని దేశంలోనే డెయిరీ రంగంలో ప్రతిష్టాత్మక సంస్థలైన ఎన్డీబీ, ఎన్డీఆర్ఎ తేల్చి చెప్పడంతో చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారన్నారు. తిరుమల ప్రసాదం మీద తప్పుడు ప్రచారాలు చేసి రాజకీయ లబ్ధి పొందడానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేసిన కుట్రలు నిర్వీర్యం కావడంతో వారు సహించలేకపోతున్నారన్నారు. అయినప్పటికీ చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ల్యాబ్ రిపోర్టులను ఒప్పుకోమన్నట్లుగా ఇంకా రభస చేస్తున్నారని, తాము కోరినట్లుగా ల్యాబ్ రిపోర్టులు ఇవ్వాల్సిందే అన్నట్లు వాళ్లు నియంతల్లాగా ప్రవర్తిస్తున్నారన్నారు. రెండు, మూడు రోజుల నుంచి ఎల్లో మీడియా కవరేజీ చూస్తే ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. చంద్రబాబు ధోరణిని ప్రజలు చీదరించుకోవడంతో వారి తరపున వైఎస్సార్ సీపీ నాయకులు, మేధావులు ప్రశ్నిస్తుండడంతో తట్టుకోలేకపోతున్నారన్నారు. సీబీఐ.. సిట్ దాఖలు చేసిన ఛార్జిషీటులో మా నాయకుల పేర్లు లేకపోయినప్పటికీ వైఎస్ జగన్, భూమన కరుణాకర్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఫోటోలు పేట్టి తప్పుడు ప్రచారాలకు దిగారన్నారు. గుంటూరులో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన తప్పుడు ఫ్లెక్సీని అంబటి రాంబాబు కనీసం చింపలేదని, ముందురోజు వెళ్లి ఇలాంటి తప్పుడు ప్రచారాలు సరికాదని హెచ్చరించారన్నారు. అంబటి రాంబాబు వచ్చేసరికి కర్రలు, రాడ్లు, రాళ్లతో టీడీపీ వాళ్లు ఎందుకున్నారని, వాళ్లు దాడులకు సిద్ధంగా ఉంటే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దారుణంగా తయారైందన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టడానికి ఇంతకన్నా వేరే అధారం అవసరం లేదన్నారు.

 

 

 

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!